-

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను: మంత్రి కాకాణి

24 Nov, 2022 14:19 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు విచారణలు ఎదుర్కోవాలి. 

నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. సీబీఐ విచారణ జరపాలని నేను అఫిడవిట్‌ దాఖలు చేశాను. టీడీపీ అధినేత చంద్రబాబులాగా స్టేలతో తప్పించుకోవాలని నేను చూడలేదు. నాపై టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయి అని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు