సీఎం జగన్‌ను కలిసిన క్రిబ్‌కో ఛైర్మన్‌ చంద్రపాల్‌ సింగ్‌ యాదవ్‌ | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన క్రిబ్‌కో ఛైర్మన్‌ చంద్రపాల్‌ సింగ్‌ యాదవ్‌

Published Thu, Oct 13 2022 9:17 PM

Kribhco Chairman Chandrapal Singh Yadav Meets CM Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్రిబోకో ఛైర్మన్‌ చంద్రపాల్‌ సింగ్‌ యాదవ్‌ కలిశారు. డిసెంబర్‌లో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్‌కో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ శంకుస్థాపనకు సీఎం వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించారు. రూ.300 కోట్లతో మొదటి దశ నిర్మాణ పనులు క్రిబోకో ప్రారంభించనుంది. డీఏపీ కాంప్లెక్స్‌ ఎరువుల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్‌ ఏర్పాటుపై కూడా సీఎంతో  క్రిబ్‌కో చైర్మన్‌ చర్చించారు. సీఎం జగన్‌  సానుకూలంగా స్పందించారు.
చదవండి: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్‌ భేటీ

ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సీఎం వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం అన్నారు. సీఎం ని కలిసిన వారిలో క్రిబ్‌కో వైస్‌ చైర్మన్‌ వల్లభనేని సుధాకర్‌ చౌదరి, క్రిబ్‌కో ఎండీ రాజన్‌ చౌదరి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ వీఎస్‌ఆర్‌ ప్రసాద్ ఉన్నారు.

Advertisement
Advertisement