‘సీఎం రైతు పక్షపాతి అనడానికి వ్యవసాయ బడ్జెట్‌ నిదర్శనం’

20 May, 2021 18:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాతి అని చెప్పడానికి వ్యవసాయ బడ్జెట్‌ నిదర్శనం వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు సంక్షేమం, శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి వైఎస్సార్‌ ల్యాబ్స్‌ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవినీతి లేకుండా లక్షా 25 వేలకోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించామని పేర్కొన్నారు. కానీ కోవిడ్‌ సమయంలో బాధ్యత లేకుండా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి మాట ఇస్తే తప్పరని మరోసారి రుజువైందని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేత మంత్రి రాజశేఖర్‌ అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చరిత్రాత్మక నిర్ణయమని ప్రశంసించారు. ఉద్యోగులు, కార్మిక సంఘాల తరపున సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు సీఎం జగన్‌కు రుణపడి ఉంటారని తెలిపారు.

చదవండి: అభివృద్ధి అంటే నాలుగు బిల్డింగులు కట్టడం కాదు: సీఎం జగన్‌ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు