ఏపీ: కొత్తగా 6,617 కరోనా కేసులు

16 Jun, 2021 19:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,01,544 మంది సాంపిల్స్‌ పరిశీలించగా.. కొత్తగా 6,617 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,82,6751కు చేరుకుంది. గత 24 గంటల్లో 53 మరణాలు చోటుచేసుకోగా.. మొత్తంగా మరణాల సంఖ్య 12,109కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

ఇక కరోనా నుంచి ఒక్కరోజులో 10,228 మంది కోలుకోగా.. ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 17,43,176గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 71,466 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా  2,07,36,435 సాంపిల్స్‌ని పరీక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1489 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం 11 మంది మృత్యువాతపడ్డారు. నిన్న ఒక్కరోజే 1436 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 5,84,429 మంది డిశ్చార్జ్‌ అ‍య్యారు. 3521 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 19,975 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

చదవండి: వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ తీసుకోండి: రాహుల్‌ 

మరిన్ని వార్తలు