#KhaidiNo7691 : చంద్రబాబు కోసం జైల్లో ప్రత్యేక ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

రాజమండ్రి జైలు వద్ద 144 సెక్షన్‌.. చంద్రబాబు కోసం జైల్లో ప్రత్యేక ఏర్పాట్లకు డీజీపీ ఆదేశాలు

Published Mon, Sep 11 2023 10:36 AM

Lokesh Brahmani Bhuvaneswari Meet Chandrababu Rajahmundry Jail - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో రిమాండు ఖైదీగా ఉన్న చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతిచ్చారు అధికారులు. నేడు జైల్లో చంద్రబాబుతో లోకేష్‌, భువనేశ్వరి, బ్రహ్మణి ములాఖత్‌ కానున్నారు. ఇక రాజమండ్రి జైలు వద్ద 144 సెక్షన్‌ అమల్లోకి తెచ్చారు. 

బారికేడ్స్‌తో జైలుకు వెళ్లే రోడ్లను బ్లాక్‌ చేశారు. డీఎస్పీ నేతృత్వంలో జైలు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ములాఖత్ విషయంలో అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇక.. జైలు పరిసరాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశారు. అలాగే చంద్రబాబు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లినట్లు సమాచారం. జైలులో డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని, అలాగే.. చంద్రబాబు వయస్సు, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టితో కార్పొరేట్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని, Z ప్లస్ సెక్యూరిటీ ఉన్న వీఐపీ కాబట్టి ఈ ఆదేశాలు అమలు చేయాలని  కలెక్టర్, వైద్యశాఖ అధికారులకు డీజీపీ కార్యాలయం సూచించినట్లు సమాచారం.

కాగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. స్నేహా బ్లాక్‌కు ఎదురుగా ఉన్న జైలు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరపనున్నారు. ఇక సోమవారం ఉదయం 4 గంటలకు నిద్ర లేచిన బాబు.. కాసేపు యోగా చేశారు. అనంతరం ఆయనకు ఇంటి నుంచి వ్యక్తిగత సిబ్బంది అల్పాహారం, మెడిసిన్‌ తీసుకొచ్చారు. చంద్రబాబుకు బ్రేక్‌ఫాస్ట్‌గా ఫ్రూట్‌ సలాడ్‌ను అందించారు. అల్పాహారంతో పాటు వీడి నీళ్లు, బ్లాక్‌ టీ కూడా ఇచ్చారు.  
చదవండి: Pawan Kalyan: అప్పుడు ఆరోపణలు.. ఇప్పుడు మద్దతు ప్రకటనలా?  

రాజమండ్రి జైలు వద్ద 144 సెక్షన్‌
రాజమండ్రి జైలు వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంది. డీఎస్పీ నేతృత్వంలో జైలు దగ్గర  భారీ భద్రత ఏర్పాటు చేశారు. బారికేడ్స్‌తో జైలుకు వెళ్లే రోడ్‌ను పోలీసులు బ్లాక్‌ చేశారు. 

కాగా రూ. 241 కోట్లు కొల్లగొట్టిన స్కిల్‌ స్కామ్‌లో ముద్దాయిగా ఉన్న చంద్రబాబుకు ఏసీబీ కోర్టు14 రోజుల పాటు రిమాండ్‌ అంటే ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా కొనసాగిన అనంతరం.. బాబును రాజమండ్రి జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. ప్రత్యేక గదిలో ఉంచాలని, భద్రత కల్పించాలని తెలిపింది. ఇంటి భోజనం, మందులు తెప్పించుకునేందుకు అనుమతి ఇచ్చింది. 

చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్‌ అర్ధరాత్రి ఒంటి గంట అనంతరం సురక్షితంగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు చేరుకుంది. అనంతరం రిమాండ్‌ ఖైదీ చంద్రబాబును జైలు అధికారులకు అప్పగించారు. జ్యుడిషియల్‌ రిమాండ్‌కు సంబంధించిన అధికారిక లాంచనాలు పూర్తి చేసి, ఆయనకు రిమాండ్‌ ఖైదీ నంబర్‌ 7691 కేటాయించారు. ఆ తర్వాత జైలులో స్నేహ బ్లాక్‌లోని ప్రత్యేక గదికి తరలించారు.

Advertisement
Advertisement