నేడు అల్పపీడనం!  | Sakshi
Sakshi News home page

నేడు అల్పపీడనం! 

Published Wed, Sep 13 2023 2:27 AM

A low pressure will form in Northwest Bay of Bengal on Wednesday - Sakshi

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలోని మధ్య భాగా­లకు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఇది మరింత బల­పడి పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మీదుగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి నివే­­దికలో తెలిపింది.

మరోవైపు నైరుతి ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉపరితల ఆవర్తనం ప్రాంతం వరకు మరో ద్రోణి పయనిస్తోంది. వీటి ఫలితంగా రానున్న రెండు­­రోజులు ఉత్తరకోస్తాలో అనేకచోట్ల, దక్షిణకోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఉత్తరకోస్తాలో ఒకటిరెండు ప్రాం­తాల్లో భారీవర్షాలు కురవవచ్చని పేర్కొంది. కోస్తాంధ్రలో గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తా­యని, సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

Advertisement
Advertisement