అది చంద్రబాబు, రామోజీ దుష్ట పన్నాగం | Sakshi
Sakshi News home page

అది చంద్రబాబు, రామోజీ దుష్ట పన్నాగం

Published Fri, Sep 1 2023 4:26 AM

Majji Srinivasa Rao about assassination attempt on ys jagan - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘నాడు ప్రతి­పక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డిని భూమి మీద లేకుండా చేయాలనే కుట్రతోనే ఆయనపై హత్యాయత్నం చేశారు. ఈ దుష్ట పన్నాగంలో చంద్రబాబు, రామోజీ­రావుల పాత్ర ఉందనడంలో సందేహం లేదు’ అని విజయనగరం జెడ్పీ చైర్మన్, వైఎ­స్సార్‌­సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస­రావు స్పష్టంచేశారు.

ఈ కేసులో ఉన్న నిందితుడికి అంతకు ముందు నేర చరిత్ర ఉన్నా సీఐఎస్‌ఎఫ్‌ భద్రత ఉన్న విశాఖ విమానా­శ్రయంలోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ క్యాంటీన్‌లో ఎలా చేరాడని ప్రశ్నించారు. శ్రీనివాస­రావు గురువారం మీడియా సమా­వేశంలో మాట్లా­డారు. సీఎం వైఎస్‌ జగన్‌పై ఆనాడు విశాఖ విమా­­నాశ్రయంలో జరిగిన హత్యా­యత్నం కేసులో వాస్తవాలను మరుగున­పర్చి, పూర్తిగా వక్ర­భా­ష్యం చెబుతూ ఈనాడు పత్రిక ప్రచురించిన వార్తను ఖండించారు.

‘ఈ కేసులో నిందితుడు శ్రీనివాస­రావు గతంలో బెయిల్‌పై వచ్చిన అనంతరం మీడియాకు ఏం చెప్పారో తెలియదా? ఇప్పుడు ఈనాడు పత్రిక ఉటంకించిన న్యాయవాది ఆ రోజు ఆ నిందితుడి పక్కనే ఉన్నారు కదా? అయినా చంద్రబాబు దగ్గర ఫీజు తీసుకున్న అడ్వొకేట్‌ ఏదో చెబితే అదేదో కోర్టు చెప్పినట్లుగా ఈనాడు పత్రిక రాసేయడమేనా? ఇదేనా జర్న­లిజం? ఇదేనా విశ్వసనీయత?’ అని మండిపడ్డారు. కేంద్ర భద్రతా బలగాల పహా­రాలో ఉండే విశాఖ విమానాశ్రయంలో ఒక టీడీపీ నాయ­కుడికి చెందిన క్యాంటీన్‌లో పని­చేస్తున్న వ్యక్తి ఆనాటి ప్రతి­పక్ష నాయ­కుడిపై హత్యా­­­యత్నం చేశాడంటే.. అదే­మైనా చిన్న విషయమా? అని ప్రశ్నించారు.

ఈ కేసులో ఉన్న పెద్ద తలకాయలన్నీ కోర్టు విచారణలో బయటకు వస్తాయని చెప్పారు. కోర్టు విచారణలో ఉన్నా, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏతో పాటు ప్రజలను కూడా తప్పుదోవ పట్టించడానికి చంద్ర­బాబు, రామోజీ­రావు ఇలాంటి వక్రమా­ర్గాలు అనుస­రి­స్తున్నారని విమర్శించారు. ఒక ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగిన తీవ్ర­మైన కేసును తొలి నుంచీ కోడి కత్తి కేసు అంటూ నీరుగార్చేందుకు ప్రయ­త్నాలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు.

ప్రజా­ద­రణ కోల్పో­యిన టీడీపీని, చంద్ర­బాబుని రామోజీరావు ఎన్ని జాకీలతో ఎత్తినా రానున్న ఎన్నిక­ల్లోనూ ప్రజాస్వామ్య­బద్ధంగా గెలవలేరని వారికి అర్థమైపోయిందని చెప్పారు. అందుకే ఎంతకైనా దిగజారి­పోతున్నారని, తప్పుడు రాతలతో పైశాచి­కానందం పొందుతున్నా­రని విమర్శించారు. ఎన్ని కుట్రలు పన్నినా, కుతంత్ర రాజకీ­యాలు చేసినా వాస్తవా­లేమిటో కోర్టు విచా­రణలో నిగ్గుతేలతాయని చెప్పారు. ప్రజా­కోర్టు­లాంటి రానున్న ఎన్ని­కల్లోనూ టీడీపీకి ఓటమి తప్పదన్నారు.

గత నాలుగేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమం, అభివృద్ధితో ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. రా­ను­న్న ఎన్ని­కల్లోనూ టీడీపీని మట్టి కరిపించి, వైఎస్‌ జగన్‌ మరోసారి ఘన విజ­యం సాధిస్తా­రని, ఆ విషయం చంద్ర­బాబు, రామో­జీ­­రావు­లకు తెలిసిపోయిందని అన్నారు. అందువల్లే టీడీపీని బతికించుకోవడానికి రామోజీరావు, చంద్రబాబు ఆపసోపాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement