Many Trains Are Cancelled On Visakhapatnam Route Due To Various Reasons, Check Trains List - Sakshi
Sakshi News home page

నేడు, రేపు విశాఖ మార్గంలో పలు రైళ్లు రద్దు

Published Fri, Jun 16 2023 4:52 AM

Many trains are canceled on Visakhapatnam route - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): విజ­య­వాడ డివిజన్‌లోని తాడి–­అనకా­పల్లి రైల్వే­స్టేషన్‌ మధ్యలో గూడ్స్‌రైలు పట్టలు  తప్ప­డం ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు­చేస్తున్నట్లు రైల్వే అధికారులు గురు­వారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్నింటిని నేడు (16న), కొన్నింటిని నేడు, రేపు (16, 17 తేదీల్లో) రద్దుచే­సి­నట్లు ప్రకటించారు.
 
నేడు రద్దయిన రైళ్లు 
విజయవాడ–విశాఖపట్న(12718/12717), విశాఖపట్నం–కడప (17488), హైదరాబాద్‌–విశాఖపట్నం (12728), విశాఖపట్నం–మహబూబ్‌నగర్‌ (12861), సికింద్రాబాద్‌–విశాఖపట్నం (12740), విశాఖపట్నం–తిరుపతి (22708), గుంటూరు–రాయగడ (17243). 

నేడు, రేపు రద్దయిన రైళ్లు
కడప–విశాఖపట్నం (17487), విశాఖపట్నం–హైదరాబాద్‌ (12727), మహబూబ్‌నగర్‌–విశాఖపట్నం (12862), విశాఖపట్నం–సికింద్రాబాద్‌ (12739),  రాయగడ– గుంటూరు (17244).  

Advertisement
Advertisement