‘మార్గదర్శి’ మోసాలపై సంఘటిత పోరు

25 Feb, 2024 17:19 IST|Sakshi

28న ‘మార్గదర్శి’ బాధితుల సంఘం మీడియా సమావేశం

సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మోసాలపై పోరాడేందుకు ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాధితుల సంఘం’ ఏర్పాటైంది. విజయవాడ కేంద్రంగా ఈ సంఘాన్ని రిజిస్టర్‌ చేయించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాధితులకు న్యాయ సహాయం, ఇతర సహకారం అందించేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. మార్గదర్శి బాధితుల సమస్యలను వివరించడానికి ఈ నెల 28వ తేదీ బుధవారం 11 గంటలకు విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది ఎం.శ్రీనివాస్‌ తెలిపారు.

బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని.. రామోజీరావు, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మోసాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడటం ద్వారా బాధితులకు న్యాయం చేయడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమని శ్రీనివాస్‌ అన్నారు. వివరాలకు 99481 14455 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

అక్రమ ఆర్థిక సామ్రాజ్యం.. ఆధారాలతో సహా బట్టబయలు
కాగా, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అయినా.. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ అయినా అంతిమంగా చేసేది నల్లధనం దందానే అని తేటతెల్లమైంది. అందుకోసం రశీదు డిపాజిట్లు, భవిష్యత్‌ చందాలు, ఘోస్ట్‌ చందాదారులు.. ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆర్థిక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ అని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతో సహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తులో భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్‌ ముఖం చాటేశారు.

రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్టు మంచం ఎక్కి మెలో డ్రామా నడిపితే.. శైలజా కిరణ్‌ తనకు ఆరోగ్యం బాగోలేదు.. కళ్లు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియళ్లను తలపించే రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడిన ఆధారాలు అబద్ధం చెప్పవు కదా! అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతోంది.

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అయినా.. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ అయినా అంతిమంగా చేసేది నల్లధనం దందానే అని తేటతెల్లమైంది. అందుకోసం రశీదు డిపాజిట్లు, భవిష్యత్‌ చందాలు, ఘోస్ట్‌ చందాదారులు.. ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆరి్థక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ అని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతోసహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తులో భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్‌ ముఖం చాటేశారు.

రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్టు మంచం ఎక్కి మెలో డ్రామా నడిపితే.. శైలజా కిరణ్‌ తనకు ఆరోగ్యం బాగోలేదు.. కళ్లు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియళ్లను తలపించే రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడిన ఆధారాలు అబద్ధం చెప్పవు కదా! అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతోంది.

మార్గదర్శిలో ఏ ఏ అవకతవకలు..?
ఆదాయపు పన్ను శాఖ చట్టానికి వ్యతిరేకంగా అక్రమ నగదు లావాదేవీలు
మార్గదర్శి పేరిట చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు
ఖాతాదారులకు రూ.కోట్లలో బకాయిలు
బ్యాంకు అకౌంట్ల నిర్వహణలో అక్రమాలు 
చిట్‌ ఫండ్‌ ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు (డిపాజిట్లకు అనుమతి లేదు)
ఖాతాదారులకు తెలియకుండానే చిట్‌ నుంచి డిపాజిట్లుగా మార్పు

ఇదీ చదవండి: బ్లాక్‌’ కోబ్రా 

whatsapp channel

మరిన్ని వార్తలు