ఆ విషయాన్ని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది: మంత్రి అమర్నాథ్‌

17 Sep, 2022 18:51 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలన్నదే మా లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగానే సుప్రీంకు వెళ్లామన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక ఇవ్వకముందే అమరావతి రాజధానిగా ప్రకటించారని తెలిపారు.

రాజధానిపై చంద్రబాబు వేసింది ఎక్స్‌పర్ట్‌ కమిటీ కాదు.. ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ అని ఎద్దేవా చేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని కేంద్రం చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవడంతోనే ఉద్యమాలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రాధికారానికి భంగం కలిగించే విధంగా ఉన్న తీర్పుపైనే సవాల్‌ చేశామని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ వ్యాఖ్యానించారు.

చదవండి: (అనంతపురం బీఈఎల్‌కు లైన్‌ క్లియర్‌)

మరిన్ని వార్తలు