21న మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష | Sakshi
Sakshi News home page

21న మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష

Published Mon, Apr 15 2024 6:20 AM

Model School Entrance Test on April 21st: andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ మోడల్‌ స్కూల్స్‌ (ఆదర్శ పా­ఠ­శాలలు)లో 2024–25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష ఈ నెల 21న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా­శాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు లేదా ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో రాయ­వచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్‌ టికెట్లు  https://cse.ap.gov.in లేదా https:// apms.apcfss.in/StudentLogin.do వెబ్‌­సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement