‘అవినీతి ఎక్కడ జరిగిందో అమిత్‌ షా, నడ్డాలు చెప్పలేకపోయారు’ | Sakshi
Sakshi News home page

‘అవినీతి ఎక్కడ జరిగిందో అమిత్‌ షా, నడ్డాలు చెప్పలేకపోయారు’

Published Tue, Jun 13 2023 4:34 PM

MP Vijayasai Reddy Slams Chandrababu Mini Manifesto - Sakshi

అమరావతి: కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఎప్పుడూ సహకారం ఉంటూనే ఉంటుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.కేంద్రానికి రాష్ట్రం, రాష్ట్రానికి కేంద్ర  సహకారం ఉంటుందని, పార్టీ వేరు, ప్రభుత్వం వేరని ఆయన పేర్కొన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య ఎప్పటికీ సత్సంబంధాలు ఉంటాయన్నారు విజయసాయిరెడ్డి.

అవినీతి ఎక్కడ జరిగిందో అమిత్‌ షా, నడ్డా చెప్పలేకపోయారని,కేంద్రం ఇచ్చే నిధులకు ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నారు కదా.. వాళ్ల ఆడిటింగ్‌లో ఎక్కడైనా అవినీతిని గుర్తించారా అని ప్రశ్నించారు. అవినీతి అని సాధారణంగా ఆరోపణలు చేశారని, రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ రద్దుపై ప్రకటన చేయలేదని, విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదన్నారు.

ఏ పార్టీతోనూ వైఎస్సార్‌సీపీ పొత్తు  పెట్టుకోదని,  చంద్రబాబు ట్రాప్‌లో అమిత్‌ షా పడతారా?, బాబు ట్రాప్‌లో పడాల్సిన అవసరం బీజేపీకి ఉంటుందా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటాయని, విశాఖకు కచ్చితంగా పరిపాలన రాజధానిని తరలిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు.రెండేళ్ల కిందటే పరిపాలన రాజధానిగా కావాల్సిన ఆఫీస్‌లు గుర్తించామని, బాబు ప్యాకేజీతో సంబంధం లేకుండా రూ, 10,400  కోట్ల రెవెన్యూ లోటు సాధించామన్నారు. కేబినెట్‌ ఆమోదం తర్వాత పోలవరానికి నిధులు వస్తాయన్నారు.

ఎన్నికల్లోపు ప్రతీ కార్యకర్తను సంతృప్తి పరుస్తామని, చంద్రబాబు మిని మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని, నవంబర్‌లో ఇతర రాష్ట్రాల హామీలను కాపీ కొట్టి చంద్రబాబు పార్ట్‌-2 మేనిఫెస్టో ఇస్తారేమో అని సెటైర్‌ వేశారు విజయసాయిరెడ్డి.

Advertisement
Advertisement