సారా, అక్రమ మద్యం కట్టడికి కఠిన చర్యలు  | Sakshi
Sakshi News home page

సారా, అక్రమ మద్యం కట్టడికి కఠిన చర్యలు 

Published Fri, Dec 16 2022 6:40 AM

Narayana Swamy On ban illegal liquor Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: నాటు సారా, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి అధికారులను ఆదేశించారు. దశాబ్దాలుగా సారా తయారీయే వృత్తిగా జీవిస్తున్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘పరివర్తనం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.

వెలగపూడిలోని సచివాలయంలో గురువారం నిర్వహించిన ఎక్సైజ్‌ శాఖ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాలకు పాల్పడినవారి నుంచి సంబంధిత మొత్తాన్ని వసూలు చేసేందుకు ఆర్‌ ఆర్‌ చట్టం ప్రయోగించాలని ఆదేశించా­రు.

అంతర్రాష్ట్రస్థాయి గంజాయి అక్రమ ర­వాణాను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీ­లు చేపట్టాలన్నారు. ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్ర­ధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, కమిషనర్‌ వివేక్‌ యాదవ్, రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నా­రు.   

Advertisement
Advertisement