వైఎస్‌ జగన్‌: గుంటూరులో సీఎంకు పాలభిషేకం | Guntur BC Corporation Members Praises YS Jagan - Sakshi
Sakshi News home page

గుంటూరులో సీఎం జగన్‌కు పాలభిషేకం

Published Mon, Oct 19 2020 1:10 PM

Palabhishekam to CM Jagan in Guntur For BC Cooperations - Sakshi

సాక్షి, గుంటూరు: 56 బీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం పాలకమండలి సభ్యులను నియమించినందకు ఆ కుల సంఘాల నాయకులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా  సీఎం జగన్‌కు గుంటూరు నగరం పాలెంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా ఇన్చార్జి మంత్రి  రంగనాథ రాజు  పాలాభిషేకం చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి,  జ్యోతిరావు పూలే విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేరుగ నాగార్జున, విడుదల రజిని ,ఉండవల్లి శ్రీదేవి, అన్నాబత్తుని శివ కుమార్, మద్దాల గిరిధర్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా బీసీ సంఘ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, ‘బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పాలకమండలి నియమించడం గొప్ప శుభపరిణామం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది.  దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌ రెడ్డి బీసీల అభివృద్ధికి పెద్దపీట వేశారు. బీసీలు రాజకీయంగా ,ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యంతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బీసీల అభివృద్ధికి సీఎం జగన్‌ ఎన్నికల ముందే ప్రణాళికను సిద్ధం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి బీసీ వర్గాలకు మేలు చేశారు కాబట్టే సీఎం జగన్‌ గెలుపులో బీసీలు భాగస్వాములయ్యారు. సీఎం జగన్‌ క్యాబినెట్‌లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు 60 శాతం పైగానే ఉన్నారు’ అని అన్నారు. 

అదేవిధంగా హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి బీసీలను బ్యాక్‌వర్డ్ క్యాస్ట్‌లా కాకుండా బ్యాక్ బోన్ కాస్ట్‌గా నిలబెట్టారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి బాటలు వేశారు. సీఎం జగన్‌ దేశానికే ఆదర్శం. గత ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడికుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది.  గుంటూరుకు 4 కార్పొరేషన్ చైర్మన్‌లు రావడం ఆనందకరం. కార్పొరేషన్ ఏర్పాటుతో సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవచ్చు’ అని అన్నారు. 

ఇక చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ, ‘ సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఈ రోజు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిలో జ్యోతిరావు పూలే కనిపించారు. దేశ రాజకీయాల్లో సీఎం జగన్‌కు ముందు ఆ తరువాత అన్న కోణంలో రాజకీయాలు నడుస్తున్నాయి. బీసీ కులాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి కార్పొరేషన్  ఏర్పాటు చేసిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు’ అని అన్నారు. 

ఈ సందర్భంగా గృహ నిర్మాణ  శాఖ మంత్రి శ్రీ రంగనాధ రాజు మాట్లాడుతూ, ‘ దేశంలో ఎక్కడా లేని లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బీసీల అభివృద్ధికి పెద్ద పీట వేశారు. ఎవరికి తెలియని కులాలను కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గుంటూరు జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడం ఆనందంగా ఉంది. కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆ కులాల్లోని సమస్యను పరిష్కరించవచ్చు’ అని పేర్కొన్నారు.  

చదవండి: ఏపీలో బీసీలు.. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ 

Advertisement
Advertisement