అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి: పేర్ని నాని | Sakshi
Sakshi News home page

అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి: పేర్ని నాని

Published Thu, Oct 28 2021 2:49 PM

Perni Nani Comments After AP Cabinet Meeting On 28th Oct - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం ఏర్పాటుచేసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి అన్నారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. అర్హత ఉన్నవారందరికీ సంక్షేమపథకాలు అందిస్తాం అని తెలిపారు. అంతేకాక బీసీ జనగణన చేసేలా అసెంబ్లీలో తీర్మానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపామన్నారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించామన్నారు. 1947 తర్వాత కుల ప్రాతిపదికన జనగణన జరగలేదు అని మంత్రి పేర్ని నాని తెలిపారు. 

కేబినెట్‌లో భేటీలో ఆమోదించిన పలు అంశాలు..
అమ్మఒడి పథకానికి అర్హత ఉన్న వారందరికీ జూన్‌, డిసెంబర్‌లో అర్జీకి అవకాశం కల్పిస్తాం. 
వైద్య, విద్య, కుటుంబ సంక్షేమశాఖలో ఉద్యోగాలకు ఆమోదం
కొత్తగా 1,285 ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ అంగీకారం.
560 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో ఫార్మాసిస్టుల పోస్టుల భర్తీకి ఆమోదం.
వైద్య కళాశాలల్లో 2,190 ఉద్యోగాల భర్తీకి ఆమోదం.
ఇప్పటి వరకు మొత్తం 4,035 కొత్త ఉద్యోగాల భర్తీకి ఆమోదం.
వైద్య ఆరోగ్యశాఖలో 41,308 ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ఉంటే.. ఇప్పటివరకు 26,197 ఉద్యోగాలు భర్తీ చేశాం. 
రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ అందించేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం.
శ్రీశారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాలు కేటాయింపుకు కేబినెట్‌ ఆమోదం.
అనంతపురం జిల్లాలో వేదపాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటుకు ఆమోదం.
కొత్తగా జైన్‌, సిక్కు కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం.
అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం.
జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్‌కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపుకు ఆమోదం.
పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్‌ ఆమోదం.
రాష్ట్రంలో 5చోట్ల సెవన్‌ స్టార్‌ పర్యాటక రిసార్ట్‌ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం.
ప్రకాశం జిల్లాలో జేఎన్‌టీయూ, గురజాడ వర్సిటీలకు ఆమోదం.

చదవండి:
కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్‌
గ్రామానికో ట్రాక్టర్‌.. ఏపీ సర్కార్‌ కసరత్తు

Advertisement

తప్పక చదవండి

Advertisement