పవన్‌ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని | Sakshi
Sakshi News home page

పవన్‌ను గెలిపించమని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని కృష్ణమురళి

Published Wed, May 8 2024 2:00 PM

Posani Krishna Murali Satirical Comments On Pawan And Chiru

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల కోసం ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ. ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్‌గా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారని పోసాని చెప్పుకొచ్చారు.

కాగా, పోసాని బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ తీసుకువచ్చిన పథకాలు వారి జీవితాల్లో మార్పులు తెస్తున్నాయి. డబ్బున్న వారు సైతం స్వచ్చందంగా పేదలకు సాయం చేయడం లేదా?. అలాగే ప్రభుత్వం చేస్తే తప్పేంటని మా కమ్మ వాళ్లని ప్రశ్నించాను. పేదలపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని చెప్పాను. పేదవాడు జీవచ్చవం కాకూడదని సీఎం జగన్‌ ఎన్నో పథకాలు పెట్టారు. ఇదంతా ఓట్ల కోసం కాదు.. ప్రజల కోసం. మానవత్వం, చిత్తశుద్దితో సీఎం జగన్‌ పనిచేస్తున్నారు.

చంద్రబాబు ఏనాడైనా సంపద సృష్టించారా?. ఆయన హయాంలో రెవెన్యూ లోటు బడ్జెటే ఉంది. జనాన్ని మోసం చేస్తూ ఇంతకాలం చంద్రబాబు కాలం వెల్లదీశారు. తాను గెలిస్తే తాకట్టులో ఉన్న బంగారం బయటకు తెస్తానని చంద్రబాబు చెప్పారు. నిజమని నమ్మిన మహిళలు, రైతులు నిలువునా మోసపోయారు. ముఖ్యమంత్రి  జగన్ సంక్షేమ పథకాలతో మానవ నిర్మాణం చేపట్టారు. పేదోడి చదువులు, ఆరోగ్యం కోసం జగన్ కష్టపడుతున్నారు.

చిరంజీవి ప్రజారాజ్యం పెడితే 18 సీట్లు వచ్చాయి. కానీ ఏనాడైనా రాష్ట్ర ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించారా?. ఇప్పుడు పవన్‌ని గెలిపించమని ఎలా అడుగుతారు?. రెండు ఎంపీ సీట్ల నుండి బీజేపీ అధికారంలోకి ఎలా రాగలిగింది?. అప్పట్లో వాజ్‌పేయి, అద్వానీ కష్టపడి పనిచేసి ప్రజాదరణ పొందారు. చిరంజీవి మాత్రం తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. ఇక రాజకీయాల్లోకి రానని చెప్పి, ఇప్పుడు మళ్ళీ జనసేన తరపున ఎలా ప్రచారం చేస్తారు?. చిరంజీవి వెన్నుపోటు పొడిచినందుకు ఎంతోమంది కాపులు బలయ్యారు. చిరంజీవి ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని హితవు పలికారు.

పవన్‌ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?

Advertisement
 
Advertisement
 
Advertisement