నాసిన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

నాసిన్‌తో ఏపీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు: సీఎం జగన్‌

Published Tue, Jan 16 2024 12:16 PM

Prime Minister Modi Sri Sathyasai District Tour Updates - Sakshi

 Updates..

ముగిసిన ప్రధాని మోదీ పర్యటన..

  • నాసిన్‌ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ 
  • అంతకుముందు నాసిన్‌ను ప్రారంభించి ప్రసంగించిన ప్రధాని

నాసిన్‌ ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం

  • చారిత్రక ప్రదేశంలో నాసిన్‌ ఏర్పాటు చేయడం సంతోషకరం 
  • నాసిన్‌ను ప్రారంభించడం ఆనందకరంగా ఉంది
  • అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట కోసం 11 రోజుల అనుష్టానం చేస్తున్నాను 
  • పుట్టపర్తి సత్యసాయిబాబ జన్మస్థలం 
  • లేపాక్షిలో వీరభద్ర మందిరం దర్శించుకోవడం ఆనందంగా ఉంది 
  • రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మాగాంధీ చెప్పారు 
  • ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు
  • గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదు 
  • జీఎస్టీ తీసుకువచ్చి పన్నులను సరళతరం చేశాం 
  • ప్రజల నుంచి వచ్చిన పన్నులు వారి సంక్షేమానికే వాడాలి 
  • ఇదే రామరాజ్య సందేశం 

నాసిన్‌ను ప్రారంభించిన ప్రధాని 

  • నాసిన్‌ను రిమోట్‌ నొక్కి ప్రారంభించిన ప్రధాని మోదీ 
  • ప్రధాని వెంట సీఎం జగన్‌, గవర్నర్‌ ఉన్నారు

వరల్డ్‌ క్లాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ రావడం గర్వంగా ఉంది : సీఎం జగన్‌ 

  • ఏపీకి నాసిన్‌ లాంటి వరల్డ్ క్లాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ రావడం గర్వంగా ఉంది 
  • నాసిన్‌తో ఏపీకి ప్రపంచస్థాయి గుర్తింపు రానుంది 
  • ఏపీ పేరును నాసిన్‌ అంతర్జాతీయంగా నిలబెట్టనుంది 
  • నాసిన్‌ అకాడమీని ఏర్పాటు చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు 

► పాలసముద్రం చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
నాసిన్ హెలిప్యాడ్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్
మరికాసేపట్లో నాసిన్ అకాడమీ ప్రారంభించనున్న ప్రధాని మోదీ, సీఎం జగన్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ. 720 కోట్ల  వ్యయంతో నిర్మించిన నాసిన్
ఐఆర్ఎస్‌కు ఎంపికైన వారికి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ టాక్సిస్ నార్కోటిక్స్ ఇనిస్టిట్యూట్

► ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేపాక్షి వీరభద్రస్వామి ఆలయ అధికారులు, పూజారులు.. ఆలయ స్థల పురాణాన్ని తోలు బోమ్మలాట ప్రదర్శన ద్వారా చూపించారు. ఈ ప్రదర్శనను ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు. 

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

► లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో ప్రధానమంత్రి ‘శ్రీ రామ.. జయ రామ’ అని చప్పట్లు కొడుతూ.. వేదపండితులతో కలిసి భగవంతునికి భజన చేశారు.

   

► ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేపాక్షి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల వద్ద ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు.

(చూడండి : ఫోటో గ్యాలరీ .. ప్రధాని దర్శించుకున్న వీరభద్రస్వామి ఆలయం ఇదే)

ప్రధాని నరేంద్ర మోదీ లేపాక్షి వీరభద్రస్వామి ఆలయానికి చేరుకున్నారు.

కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌
కడప విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్ లో సత్యసాయి జిల్లాకు పయనం
పాల సముద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో పాల్గొననున్న సీఎం
కడప విమానాశ్రయంలో సీఎంకు స్వాగతం పలికిన డిప్యూటి అంజాద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు
కాసేపట్లో లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోదీ 
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
కాసేపట్లో పెనుకొండ నియోజకవర్గంలో పాలసముద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్‌)ను ప్రారంభించనున్న మోదీ
ఈ కార్యక్రమానికి హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయంలో మంగళవారం మధ్యాహ్నం 12.50 గంటలక చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ,డిఐజి అమ్మి రెడ్డి, పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబులపతి,  పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ, బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, పార్థసారథి, శ్రీసత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్.జె. రత్నాకర్ ఎయిర్‌పోర్ట్‌ భద్రత అధికారి తదితరులు ప్రధానిని కలిసి పుష్పగుచ్చాలను అందించే ఘన స్వాగతం పలికారు.

నాసిన్‌ పూర్తి వివరాలేంటీ?
నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు & మాద‌క ద్ర‌వ్యాల అకాడ‌మీ (NACIN) కు సూక్ష్మరూపమే నాసిన్‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్  శ్రీ స‌త్య‌సాయి జిల్లాలోని పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో దీనిని ఏర్పాటు చేశారు. దాదాపు రూ. 541 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ కేంద్రానికి ఎన్నో విశిష్టతలున్నాయి. గోరంట్ల మండ‌ల ప‌రిధిలోని పాల‌స‌ముద్రం స‌మీపంలో 44వ జాతీయ ర‌హ‌దారికి అనుకుని 503 ఎక‌రాల విస్తీర్ణంలో ఈ శిక్ష‌ణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

IASల‌కు ముస్సోరిలో, IPSల‌కు హైద‌రాబాద్‌లో శిక్ష‌ణ ఇస్తున్నట్టే.. ఇండియ‌న్ రెవెన్యూ స‌ర్వీసెస్‌(IRS)కు ఎంపికైన వారికి పెనుకొండలోని నాసిన్‌లో శిక్ష‌ణ ఇస్తారు. నాసిన్‌ను సులభంగా చేరుకునేందుకు భవిష్యత్తులో రైల్వే లైన్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాసిన్‌లో ప‌ని చేసే సిబ్బంది పిల్ల‌ల విద్య కోసం నాసిన్ స‌మీపంలోనే కేంద్రీయ విద్యాల‌యం మంజూరు చేశారు. 

ఈ శిక్షణా సంస్థలో సమర్థవంతమైన పన్ను పరిపాలన కోసం అవసరమైన నైపుణ్యాన్ని బోధిస్తారు. ఈ రంగంలో అత్యుత్తమ అధికారులను ఎంపిక చేసి వారితో బోధన చేయిస్తాయి. సమగ్ర శిక్షణా పాఠ్యాంశాలు, అనుకూలమైన వాతావరణం మరియు పూర్తి మౌలిక సదుపాయాలున్న క్యాంపస్ ద్వారా అత్యున్నత ఆదాయపు పన్ను శాఖ అధికారులు దేశం కోసం సిద్ధమవుతారు.

Advertisement
Advertisement