సీఎం జగన్‌పై హత్యాయత్నాన్ని  ఖండిస్తూ యూకేలో ప్రవాసాంధ్రులు నిరసన | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌పై హత్యాయత్నాన్ని  ఖండిస్తూ యూకేలో ప్రవాసాంధ్రులు నిరసన

Published Mon, Apr 15 2024 5:12 AM

Protest in UK condemning assassination attempt on CM Jagan - Sakshi

సాక్షి,అమరావతి: చంద్రబాబుకు ఏ దురుద్దేశమూ లేకపోతే ఇటీవల అమరావతి పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తూ సీఎం జగన్‌ను రాళ్లతో కొట్టండి అని ఎందుకు అన్నారో సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ యూకే సోషల్‌ మీడియా సభ్యులు భూమిరెడ్డి కార్తీక్‌ టీడీపీని డిమాండ్‌ చేశారు. బాబు అన్న కొద్ది గంటల్లోనే సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగిందని గుర్తు చేశారు. దీనిని వైఎస్సార్‌సీపీ యూకే విభాగం తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు.

ఆదివారం యూకేలో సీఎం జగన్‌పై  హత్యాయత్నం ఘటనను ఖండిస్తూ నిరసన చేపట్టారు. కార్తీక్‌ మాట్లాడుతూ.. విజయవాడలో సీఎం జగన్‌ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని, దాన్ని చంద్రబాబు ఓర్చుకోలేక పోయారని అన్నారు. యాత్ర ఇలాగే సాగితే టీడీపీకి రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించే సీఎం జగన్‌పై ఘాతుకానికి తెగబడ్డారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌ కచి్చతంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పాలెం క్రాంతి కుమార్‌ రెడ్డి, మలిరెడ్డి కిషోర్, వడ్డూరి అప్పాజీ, వీర పులిపాకల, వజ్రాల రాజశేఖర్, భీమిరెడ్డి ప్రతాప్, మాదిరెడ్డి శ్రీకాంత్, వెంకట్‌ రమణ మామిడిశెట్టి, వంశీ కృష్ణా రెడ్డి కూకటి, గుండం సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement