తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో ఐదు రోజులు వానలే.. | Telugu States IMD Rainfall Weather Report: Rain Forecast To AP And Telangana For Five Days - Sakshi
Sakshi News home page

Rains For 5 Days In AP & TS: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో ఐదు రోజులు వానలే..

Published Thu, Aug 24 2023 9:42 AM

Rain Forecast To AP And Telangana For Five Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

ఇక, అల్ప పీడనం ప్రభావకంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. 

మరోవైపు, తెలంగాణలో మేడ్చల్‌, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్‌, జనగామ, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఈ మేరకు ఎల్లో, గ్రీన్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. 

ఇది కూడా చదవండి: చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్‌ గౌడ్‌ కన్నుమూత

Advertisement
Advertisement