బంగాళాఖాతంలో అల్పపీడనం! | IMD Predicts Rain In The State For The Next 3 Days- Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో అల్పపీడనం!

Published Wed, Sep 20 2023 4:41 AM

Rain in the state for the next 3 days - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌–ఒడిశా తీరాలకు ఆనుకుని మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కి.మీల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొన­సాగుతోంది. ఈ అల్పపీడనం గురువారంకి పశ్చిమ, వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్‌ మీదుగా పయనిస్తుందని భారత వా­తావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రుతు­పవ­న ద్రోణి రాజస్థాన్‌ నుంచి ప్రస్తుత అల్పపీడన ప్రాంతం వరకు తూర్పు మధ్య బంగాళా­ఖా­తం మీదుగా వెళ్తోంది.

వీటి ప్రభావంతో రాను­న్న 3 రోజులు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయల­సీమల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. వచ్చే మూడు రోజులు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గంటకు 45–55, గరిష్టంగా 65 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. 

Advertisement
Advertisement