మహిళ కడుపులో 4.5 కిలోల కణితి తొలగింపు  | Sakshi
Sakshi News home page

మహిళ కడుపులో 4.5 కిలోల కణితి తొలగింపు 

Published Thu, Dec 30 2021 4:26 AM

Rare surgery successful in Vijayawada government hospital - Sakshi

లబ్బీపేట (విజయవాడ తూర్పు): మహిళ కడుపులోని గర్భసంచికి అతుక్కుని ఉన్న 4.5 కిలోల కణితిని విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి తొలగించారు. రక్తస్రావం, కడుపునొప్పితో విజయవాడకి చెందిన సీహెచ్‌ ఆదిలక్ష్మి పాత ప్రభుత్వాస్పత్రిలోని ప్రసూతి విభాగానికి ఇటీవల వచ్చింది. ఆమెకు పరీక్ష చేసిన వైద్యులు కడుపులో పెద్దగడ్డ ఉన్నట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స చేయాని నిర్ణయించారు.

జనరల్‌ సర్జరీ ప్రొఫెసర్, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యేకుల కిరణ్‌కుమార్, గైనకాలజీ నిపుణులు డాక్టర్‌ విజయశీల, డాక్టర్‌ కరుణలతో కలిసి లేపరోటమీ విధానంతో అతి క్లిష్టమైన శస్త్ర చికిత్స నిర్వహించి కడుపులోని గడ్డను తొలగించారు. లేపరోటమీ, రిలీజ్‌ ఆఫ్‌ అథిషన్స్, టీఏహెచ్‌ విధానం అవలంభించి ఈ శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. రోగి ఆదిలక్ష్మి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. శస్త్ర చికిత్సలో మత్తు నిపుణులు డాక్టర్‌ పీఎన్‌రావు, డాక్టర్‌ రాంబాబు, గైనిక్‌ పీజీ డాక్టర్‌ శాంత్రలు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement