ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌కు మరోసారి అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు

28 Nov, 2021 22:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆదివారం రాత్రి  హైదరాబాద్‌కు తరలించి అక్కడి ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం గవర్నర్‌ కరోనా బారినపడి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అప్పట్లో కరోనా రిపోర్టు నెగిటివ్‌ రావడంతో డిశ్చార్జి అయి విజయవాడకు చేరుకున్నారు. కానీ, ఆదివారం రాత్రి మరోసారి అస్వస్థతకు గురికావడంతో రాజ్‌భవన్‌ వర్గాలు తిరిగి డాక్టర్లను సంప్రదించగా, అదనపు చికిత్స అవసరమని వారు సూచించినట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు