Sakshi News home page

అంగన్‌వాడీ బుజ్జాయిలకు ప్రత్యేక కిట్లు

Published Fri, Jul 7 2023 4:35 AM

Special kits for Anganwadi Kids in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: అంగన్‌వాడీల్లోని చిన్నారులు ఆడుతూ పాడుతూ అభ్యాసం చేయడం ద్వారా వారి చదువులకు బలమైన పునాదులు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. 3 నుంచి ఆరేళ్లలోపు వయసు గల చిన్నారులకు ప్రీ ప్రైమరీ (పీపీ–1, 2) విద్యాభ్యాసానికి దోహదం చేసే సామగ్రిని అందిస్తోంది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న 8.50 లక్షల మంది పిల్లలకు ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (పీఎస్‌ఈ) కిట్ల పంపిణీ చేపట్టింది. వీటిలో ఒక పలక, 12 రంగుల స్కెచ్‌ పెన్సిళ్లు, రెండు పెన్సిళ్లు, ఒక రబ్బరు (ఎరేజర్‌), షార్ప్‌నర్‌తో కూడిన కిట్‌ను ప్రతి విద్యార్థికి అందజేస్తున్నారు. ఈ నెలాఖరులోగా వీటి పంపిణీ పూర్తి చేసేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. 

ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి ఒక్కో స్పెషల్‌ కిట్‌ 
రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. ప్రతి కేంద్రానికీ 19 రకాల ఆట వస్తువులతోపాటు మేధస్సుకు పదును పెట్టి విద్యాభ్యాసానికి దోహదం చేసే ప్రత్యేక కిట్‌లను ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి ఒక్కొక్కటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. ఆ కిట్‌లో చిన్నారులకు ఉపయోగపడే మ్యాట్, సాఫ్ట్‌ బాల్, చెక్కతో చేసిన సంఖ్యల పజిల్, పెగ్‌ బోర్డు, అబాకస్, చెక్క బూట్లు, బిల్డింగ్‌ బ్లాక్‌లు, గమ్‌ స్టిక్స్, 25 ముక్కల రంగుల పేపర్లు, 5 సెట్ల వాటర్‌ కలర్స్, 5 సెట్ల స్కెచ్‌ పెన్నులు, 5 ప్యాకెట్ల పెన్సిల్స్, 5 రబ్బర్లు, 5 షార్ప­నర్లు, నమూనాల ట్రేసింగ్‌ బోర్డు, డాఫ్లి, బ్లోయింగ్‌ సంగీత వా­యిద్యా­లు, 20 పలకలు, బొమ్మలు తయారు చేసే­లా 5 సెట్ల మౌల్డింగ్‌ క్లే, మూడు ప్యాకెట్ల డస్ట్‌ ఫ్రీ సుద్దలు, బంతితో బాస్కెట్‌ బాల్‌ హోప్, కథల పుస్తకాలు 20 అందించారు. వీటిని ఆయా అంగన్‌వాడీలకు వచ్చే చి­న్నా­రులు అక్కడే వినియోగించుకుని ఆడుతూ పా­డుతూ ఆసక్తిగా అభ్యాసం చేసేలా ఏర్పాట్లు చేశారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement