సీఎం జగన్‌ను కలిసిన శ్రీలంక ప్రతినిధులు | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన శ్రీలంక ప్రతినిధులు

Published Mon, Jul 3 2023 7:08 PM

Sri Lankan Representatives Meet CM YS jagan - Sakshi

సాక్షి,  అమరావతి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శ్రీలంక ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం శ్రీలంక ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ సెంథిల్‌ తొండమాన్‌, శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ డి.వెంకటేశ్వరన్‌, ఇతర అధికారులు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా తమ దేశంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని శ్రీలంక ప్రతినిధులు కోరారు.  

శ్రీలంక నుంచి భారత దేశానికి వచ్చే భక్తుల్లో 50శాతం మంది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వస్తారని, వారి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి విన్నామని శ్రీలంక ప్రతినిధులు సీఎం జగన్‌కు తెలిపారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి విన్న తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలన్న తమ  అధ్యక్షుడు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిని కలిసినట్లు శ్రీలంక ప్రతినిధులు తెలిపారు.

వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. ఆక్వారంగం, వాటి ఎగుమతుల్లో ఏపీ గణనీయ ప్రగతి సాధించిన నేపధ్యంలో... శ్రీలంకలో కూడా ఆక్వారంగ ప్రగతికి సహకారం అందించాలని కోరారు. కోవిడ్, దిగుమతులు కారణంగా దెబ్బతిన్న శ్రీలంక ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడుతోందని.., ఖనిజవనరులు, పర్యాటకరంగంలో పెట్టుబడులకు శ్రీలంక ప్రభుత్వం ఆహ్వానిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.

చదవండి: నాలుగేళ్ల జగన్‌ పాలనపై ఒంగోలు కుర్రాడి లెక్కలు చూశారా?

Advertisement

తప్పక చదవండి

Advertisement