‘గురివింద’ బండారం బట్టబయలు

3 Apr, 2024 06:18 IST|Sakshi
మార్గదర్శి పేరుతో తరలిస్తున్న నగదును విశాఖలోని ద్వారకానగర్‌లో స్వా«దీనం చేసుకున్న పోలీసులు

లెక్కాపత్రం లేని డబ్బుతో అడ్డంగా దొరికిన ‘మార్గదర్శి’

మార్గదర్శి పేరుతో అక్రమంగా రూ.51,99,800 నగదు తరలింపు

ద్వారకానగర్‌ వద్ద పోలీస్‌ తనిఖీల్లో పట్టుబడిన డబ్బు.. మరో రూ.36,88,675 విలువైన 51 చెక్కులూ లభ్యం

స్కూటీపై ఇద్దరు వ్యక్తులు సూట్‌కేస్‌లో తీసుకెళుతుండగా పట్టివేత

మార్గదర్శి డబ్బు అని, బ్యాంకులో జమ చేసేందుకు తీసుకెళుతున్నట్లు బుకాయింపు

ఆధారాలు కోరితే పొంతన లేని సమాధానాలు

టీడీపీ నేతలకు చేరవేసేందుకే నగదు తరలిస్తున్నారని అనుమానాలు

విశాఖ సిటీ/సాక్షి, అమరావతి: రాజ గురివింద రామోజీ బరితెగించారు. ఎన్నికల వేళ పచ్చ పార్టీకి భారీ మొత్తంలో డబ్బు అక్రమ తరలింపునకు తెగబడ్డారు. రాజకీయంగా చంద్రబాబుకు కొమ్ముకాసే రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ లెక్కా పత్రం లేకుండా విశాఖ నగరంలో భారీగా నగదును తరలిస్తూ అడ్డంగా దొరికిపోయింది. రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

దీంతో రామోజీ ఆరి్థక అక్రమాల బండారం మరోసారి బట్టబయలైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖ పోలీసు బృందాలు, కేంద్ర బలగాలు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం విశాఖ నగరం ద్వారకానగర్‌ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఏపీ31సీజీ 7825 నంబరు స్కూటీపై ఇద్దరు వ్యక్తులు సూట్‌కేస్‌తో వెళుతుండగా పోలీసులు వారిని ఆపారు. వారి వద్ద ఉన్న సూట్‌కేసును తనిఖీ చేయగా అందులో రూ.500 నోట్ల కట్టలు, చెక్కులు కనిపించాయి. వాటిని లెక్కించగా రూ.51,99,800 నగదు ఉన్నట్లు తేలింది.

రూ.36,88,675 విలువైన 51 చెక్కులను గుర్తించారు. ఆ డబ్బు ఎవరిదని, ఎక్కడకు తీసుకువెళుతున్నారని పోలీసులు ప్రశి్నంచారు. ఇందుకు వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఆ డబ్బు మార్గదర్శి చిట్స్‌కు సంబంధించినదని, ఎవరికీ ఇవ్వడానికి కాదని, బ్యాంకులో డిపాజిట్‌ చేయడానికి తీసుకెళుతున్నట్లు బుకాయించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆధారాలు చూపించాలని అడిగినప్పటికీ వారు చూపించలేదు. దీంతో పోలీసులు నగదును స్వా«దీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించారు.  అందులో ఒకరు లక్ష్మణరావు మార్గదర్శి చిట్స్‌లో అకౌంట్స్‌ అసిస్టెంట్‌గా, మరొకరు శ్రీనివాస్‌ ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. వారు ఆ డబ్బుకు ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు నగదు, చెక్కులను ఎన్నికల అధికారులకు అందజేశారు. వారు ఆదాయ పన్ను శాఖ అధికారులకు అందజేశారు.

 

గత ఎన్నికల్లోనూ ఇదే విధంగా తరలింపు! 
ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున పెద్ద మొత్తంలో నగదు తరలిస్తే అందుకు ఆధారాలు ఉండాలి. ఈ విషయం పత్రికాధిపతి రామోజీకి చెందిన సంస్థకు తెలియనిది కాదు. అయినా మార్గదర్శి ద్వారా లక్షలాది రూపాయలు  ఎటువంటి ఆధారాలు లేకుండా తరలించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలకు డబ్బు చేరవేసేందుకే ఈ నగదును తీసుకువెళుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పోలీసులు పకడ్బందీగా తనిఖీలు చేస్తుండటంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ముసుగులో టీడీపీ అభ్యర్థులకు డబ్బు చేరవేస్తున్నట్లు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో కూడా విశాఖలో ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచిల నుంచి భారీ స్థాయిలో నగదు పంపిణీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే భీమిలిలో ఉన్న ప్రైవేటు పరిశ్రమ నుంచి టీడీపీ నేతలకు రూ.కోట్లు ముట్టినట్లు వార్తలు వినిపించాయి. వాస్తవానికి మార్గదర్శి, ఆ పరిశ్రమ సిబ్బంది చేతుల మీదుగానే రూ.కోట్ల డబ్బు పంపిణీ జరిగిందన్నది బహిరంగ రహస్యమే. ఈ ఎన్నికల్లోనూ అదే పంథాలో డబ్బు పంపిణీకి పూనుకున్నట్లు ఈ వ్యవహారంతో తేటతెల్లమైంది. 

డిజిటల్‌ చెల్లింపులేవి రామోజీ! 
2022 డిసెంబర్‌ నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కొత్త చిట్టీలు వేయడంలేదు. పాత చిట్టీలే కొనసాగుతున్నాయి. కాలపరిమితి ముగియడంతో చిట్టీలు మూసి­వేస్తున్నారు. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచిల్లో చిట్టీ గ్రూపుల సంఖ్య సగానికంటే తగ్గిపోయింది. అయినప్పటికీ విశాఖపట్నం బ్రాంచిలో ఖాతాదారుల నుంచి 3 రోజుల్లోనే రూ.51 లక్షలు నగదు రూపంలో వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఆ ప్రకారం నెలకు రూ.5.10 కోట్లు వసూ­లు చేస్తు­న్నట్టు. ఇక రాష్ట్రంలోని 37 బ్రాంచిల ద్వారా నెలకు సగటున రూ.188.70 కోట్లు వసూలు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదంతా నగదు రూపంలోనే వసూలు చేస్తున్నట్లు కూడా స్పష్టమవుతోంది.

ప్రస్తుతం కిళ్లీ దుకాణాలు, బజ్జీ దుకాణాల్లో కూడా డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్నారు కాబట్టి నగ­దు లావాదేవీలు జరపకూడదని రామోజీ ఈనాడు­లో పదేపదే వార్తలు రాయిస్తున్నారు. కానీ ఆయన మాత్రం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ద్వారా భారీ­గా నగ­దు లావాదేవీలే నిర్వహిస్తుండటం గమ­నార్హం. చందాదారుల నుంచి డిజిటల్‌/ఆన్‌ౖ­లెన్‌ చెల్లిం­పులు ఎందుకు స్వీకరించడం లేదు? నగదు రూపంలోనే ఎందుకు తీసుకుంటున్నారన్నప్రశ్న తలెత్తుతోంది. మార్గ­దర్శి పేరుతో ఎన్నికల్లో టీడీపీకి డబ్బు తరలింపు, భారీగా నల్లధనం చలామణిలోకి తేవడమే లక్ష్యంగా ఈ దందా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. 

పక్కా మనీ లాండరింగే.. 
విశాఖలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడటంతో రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ముసుగులో భారీగా నల్లధనం దందా మరోసారి ఆధారాలతోసహా వెలుగులోకి వచ్చింది. ఈ డబ్బు ఎక్కడిదని మార్గదర్శి సిబ్బందిని పోలీసులు ప్రశి్నంచగా పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకునేందుకు యతి్నంచారు. చివరగా గత మూడు రోజుల్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచి కార్యాలయంలో చందాదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కానీ ఆ నగదు, చెక్కులకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం పోలీసులు వాటిని జప్తు చేశారు.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మనీ లాండరింగ్‌కు పాల్పడుతోందని గతంలో స్టాంపులు–రిజి్రస్టేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో వెల్లడైన విషయం వాస్తవమేనని ఈ ఘటన మరోసారి రుజువుచేసింది. చిట్‌ఫండ్స్‌ చట్టం ప్రకారం ఒక బ్రాంచిలో వసూలు చేసే మొత్తాన్ని అదే బ్రాంచి పరిధిలో బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ఇతర బ్యాంకుల్లోని ఖాతాల్లోకి మళ్లించకూడదు. రామోజీరావు ఈ నిబంధనలను ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చందాదారుల సొమ్మును హైదరాబాద్‌లోని తమ ప్రధాన కార్యాలయం ఖాతాకు మళ్లిస్తూ వచ్చారు. అదే రీతిలో చందాదారుల సొమ్మును సోమవారం విశాఖలో ఇతరత్రా అవసరాలకు మళ్లిస్తూ పోలీసులకు చిక్కినట్లు స్పష్టమైంది.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers