కోనసీమలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు దుర్మరణం

22 May, 2023 09:06 IST|Sakshi

సాక్షి, కోనసీమ జిల్లా: అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న కారుని లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం ముమ్మడివరంలో జరిగిందని తెలిపారు.

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని, సదరు బాధితులను గుర్తించే ప్రక్రియ చేపట్లినట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

(చదవండి: సమస్యల పరిష్కారానికి కృషి)

మరిన్ని వార్తలు