AP: రేపటి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ రూ.3000 | Sakshi
Sakshi News home page

AP: రేపటి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ రూ.3000

Published Sun, Dec 31 2023 9:23 PM

Three Thousand YSR Pension In AP From 1st Jan 2024 - Sakshi

సాక్షి, అమరావతి: రేపు(సోమవారం) ప్రజలంతా కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. కొత్త ఏడాది నుంచి ఏపీలో పెన్షనర్లకు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక మూడు వేలకు పెరగనుంది. పెన్షన్‌దారులకు మూడు వేలు అందనున్నాయి. 

కాగా, సీఎం జగన్‌.. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో.. అవ్వాతాతలకు మనవడిగా, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అన్నగా, తమ్ముడిగా, చేనేత, కల్లుగీత, మత్స్య, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు శ్రేయోభిలాషిగా జగనన్న ప్రభుత్వం మనసుతో పెంచి ఇస్తున్న.. వైఎస్సార్ పెన్షన్ కానుక, ఠంఛన్‌గా పెన్షన్, పింఛన్ల పెంపు అవ్వాతాతల పింఛన్ రూ. 3,000 వరకు పెంచుకుంటూ పోతాం.. అని మేనిఫెస్టోలో చెప్పిన మాటను తూ.చ. తప్పకుండా నెరవేరుస్తూ!.. 

ఇకపై ప్రతీ నెలా రూ.3,000
రాష్ట్రవ్యాప్తంగా 1 జనవరి, 2024 నుండి 8 రోజులపాటు పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలు.. ప్రజా ప్రతినిధులు, శాసన సభ్యులు, గ్రామస్తులు అందరూ ఒకటో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు.

3 జనవరి, 2024న కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటూ, పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు సీఎం జగన్‌ అందజేయనున్నారు. 

దీంతోపాటు కొత్తగా అర్హులైన 1,17,161 మందికి పెన్షన్ కార్డుల పంపిణీ.

దేశంలోనే అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం.

గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా ఠంఛన్‌గా ప్రతీ నెలా ఒకటో తేదీ ప్రొద్దున్నే తలుపు తట్టి, గుడ్ మార్నింగ్ చెప్పి మరీ చిరునవ్వుతో లబ్దిదారుల గడప వద్దనే పెన్షన్లు అందజేత.. అది ఆదివారమైనా, సెలవు రోజైనా సరే..

పెన్షన్ పెంపు ద్వారా అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు లబ్ధి.

గత పాలనలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ పెన్షన్ కేటగిరిలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఒక్కో లబ్దిదారుడికి నెలకు అందించిన పెన్షన్ కేవలం రూ.1,000. అయితే, జగనన్న ప్రభుత్వం ఒక్కో లబ్దిదారునికి పెన్షన్ నెలకు రూ. 2,250తో మొదలుపెట్టి పెంచుకుంటూ రూ.3,000 దాకా తీసుకొచ్చింది.

ప్రతీ నెలా ఠంచన్‌గా అందిస్తూ..
1 జనవరి, 2024 నుండి 66.34 లక్షల పెన్షన్లపై ఏటా చేయనున్న వ్యయం రూ.23,556 కోట్లు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం లబ్ధి అక్షరాల రూ. 83,526 కోట్ల పైమాటే. పెన్షన్లు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్.

పెన్షన్‌ పెంపు ఇలా..
జులై 2019 నుంచి పెన్షన్‌ను రూ.2,250లకు పెంపు.
జనవరి 2022న రూ.2,500కు పెన్షన్‌ పెంపు.
జనవరి 2023న రూ. 2,750కు పెంపు.
జనవరి 2024న రూ.3వేలకు పెంపు.

పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు.
2014-19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు.
జులై 2019 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1384 కోట్లు.
జనవరి 2022 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1570 కోట్లు.
జనవరి 2023 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,776 కోట్లు.
జనవరి 2024 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,968 కోట్లు.

గత ప్రభుత్వం ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం నెలకు రూ.1000 చొప్పున, ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ 39 లక్షల మందికి సగటున ఖర్చుచేసిన మొత్తం నెలకు రూ.400 కోట్లు మాత్రమే. అదే జగనన్న ప్రభుత్వంలో ఇస్తున్న పెన్షన్ల సంఖ్య 66.34 లక్షలు. గడిచిన ఐదేళ్లలో 55 నెలల్లో కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లు 29,51,760. 

ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం నెలకు రూ.3000 చొప్పున 66.34 లక్షల మందికి నెలకు సగటున చేస్తున్న ఖర్చు రూ.1968 కోట్లు. గడచిన 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేసిన ఖర్చు రూ.83,526 కోట్లు. 

పెన్షన్‌ లబ్ధిదారులు కూడా గత ప్రభుత్వ పాలనలో 39 లక్షలు ఉంటే, ఇప్పుడు 66.34లక్షలకు పెంపు:
గత ప్రభుత్వంలో 2014-19 మధ్య లబ్ధిదారులు 39 లక్షలు.
2019లో పెన్షన్‌ లబ్ధిదారులు రూ.52.17 లక్షలు.
2022లో పెన్షన్‌ లబ్ధిదారులు రూ.62 లక్షలు.
2023లో పెన్షన్‌ లబ్ధిదారులు రూ.64.45 లక్షలు.
2024లో పెన్షన్‌ లబ్ధిదారులు రూ.66.34 లక్షలు. 

పెన్షన్ల విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను చూసుకుంటే..
గత పాలనలో పింఛన్‌ కోసం వృద్ధులు, వికలాంగులు చాంతాడంత క్యూలో గంటలతరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ  ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా  2.6లక్షల గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఠంచన్‌గా ప్రతినెలా కొటో తేదీనే పొద్దుటే తలుపుతట్టి గుండ్ మార్నింగ్‌ చెప్పిమరీ చిరునవ్వుతో లబ్ధిదారుల గడపవద్దనే పెన్షన్లు అందిస్తున్నారు. సెలవు, పండుగ రోజులు అయినా పెన్షన్లను అందిస్తున్నారు. 

గత ప్రభుత్వ పాలనలో పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, వీలైనంతమందికి లబ్ధి ఎలా ఎగ్గొట్టాలా అన్ని కుతంత్రాలు, గ్రామానికి ఇంతమందికే లబ్ధి అనే కోటాలు, కోతలు చేసేవారు. ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి అవకాశం వచ్చేది. తమ వర్గం, తమ పార్టీ, తమ వారికే పెన్షన్లు ఇచ్చే ధోరణి ఉండేది. అందులోనూ జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే వృద్ధులు, వికలాంగులు, అన్న కనికరం కూడా లేకుండా వారికిచ్చే పెన్షన్లలో వాటా కొట్టేసేలా గత పాలన ఉండేది.
 
నేడు, కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, అశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేసేవారు. అర్హులైన ఉండి ఒకవేళ ఏ కారణంచేతైనా లబ్ధి అందని వారికి మరో అవకాశాన్ని ఇస్తూ ప్రతి ఏటా జూన్‌, డిసెంబర్‌లలో బైయాన్యువల్‌ శాంక్షన్ల ద్వారా లబ్ధి అందజేస్తున్నారు.  

పెన్షన్ల మంజూరుకోసం మధ్య దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించి మరీ, సోషల్ ఆడిట్‌ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు. అర్జీ పెట్టుకున్న 21రోజుల్లో అర్హులకు పెన్షన్‌ కార్డుల మంజూరు చేస్తోంది ఈ ప్రభుత్వం. అవ్వాతాతలు, అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు చేదోడు వాదోడుగా వాలంటీర్‌, సచివాలయ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. లబ్ధిదారు ఆత్మాభిమానం నిలబడేలా వారికి సేవలు అందిస్తోంది. 

2014-19 మధ్య వృద్ధాప్య, వితంతు, మహిళల పెన్షన్‌ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారుడు పొందిన మొత్తం రూ.58,000

ఈ ప్రభుత్వంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్‌ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారునికి అందించిన, అందిస్తున్న మొత్తం రూ.1,47,500. గత ప్రభుత్వంలో కంటే రూ.89,500 అదనం. 

గత ప్రభుత్వంలో వికలాంగుల పెన్షన్‌ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. వికలాంగుల పెన్షన్‌ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ అందించిన, అందిస్తున్న లబ్ధి రూ.1,82,000. గతం కంటే ఇది రూ.1,23,500 అదనం. 

Advertisement
Advertisement