తిరుమల: బాగా పెరిగిన భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమల: బాగా పెరిగిన భక్తుల రద్దీ.. నిండిపోయిన 31 కంపార్ట్‌మెంట్‌లు

Published Wed, Sep 6 2023 7:22 AM

Tirumala News: TTD Sarva Darshanam Timings Updates - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 

ఇదిలా ఉంటే.. నిన్న(సెప్టెంబర్‌ 5, మంగళవారం) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,946. తలనీలాలు సమర్పించిన వాళ్ల సంఖ్య 30,294గా ఉంది. శ్రీవారి హుండీ ఆదాయం 4.51 కోట్లుగా లెక్క తేలింది. 

ఈ ఏడాది అధిక మాసం సందర్భంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది TTD. 17వ తేదీ వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది.  18వ తేదీన ధ్వజారోహణంతో బ్రహోత్సవాలు ప్రారంభం అవుతాయి. అదే రోజు తిరుమలకు విచ్చేసి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 22న గరుడసేవ, 23న స్వర్ణరథోత్సవం, 25న మహారథం, 26న చక్రస్నానం, చివరగా.. ధ్వజారోహణంతో వార్షిక బ్రహోత్సవాలు ముగుస్తాయి. మళ్లీ అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

ఇదీ చదవండి: యువతలో సనాతన ధర్మం కోసం టీటీడీ ప్రయత్నం

Advertisement

తప్పక చదవండి

Advertisement