Sakshi News home page

రవాణా ఆదాయం రయ్‌ 

Published Mon, Aug 8 2022 3:32 AM

Transport revenue in increasing steadily Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి:  కోవిడ్‌ సంక్షోభం నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో రవాణా ఆదాయం క్రమంగా పెరుగుతోంది. 2021–22 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే ఈ ఆర్థిక ఏడాది అదే సమయంలో రవాణా ఆదాయంలో 58.70 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్‌కు ముందు అంటే 2019–20తో పోల్చితే 37.95 శాతం వృద్ధి నమోదైంది. వాహన విక్రయాలు పెరగడంతో జీవిత పన్ను, త్రైమాసిక పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదల నమోదైంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత వృద్ధి ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో నమోదు కావడం గమనార్హం. ద్విచక్రవాహనాలు మినహా మిగతా అన్ని రకాల వాహనాల విక్రయాల్లో వృద్ధి నమోదైంది.  

కార్ల జోరు.. 
ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కార్ల విక్రయాల్లో 5.11 శాతం వృద్ధి నమోదైంది. ఆటోలు, ప్యాసింజర్‌ వాహనాలు, గూడ్స్‌ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఆటోల విక్రయాల్లో 69.7 శాతం, ప్యాసింజర్‌ వాహనాలు 57.87 శాతం, గూడ్స్‌ వాహనాల విక్రయాల్లో 37.28 శాతం వృద్ధి నమోదైంది. ద్విచక్ర వాహనాల విక్రయాల్లో మాత్రం –3.75 శాతం వృద్ధి నమోదైంది.



కోవిడ్‌కు ముందు 2019–20 తొలి త్రైమాసికంలో రూ.749.75 కోట్లు ఆదాయం రాగా ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ.1,034.25 కోట్ల ఆదాయం సమకూరింది. జాతీయ స్థాయిలో అన్ని రకాల వాహనాల విక్రయాల్లో ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారీగా వృద్ధి నమోదైంది. కోవిడ్‌ సంక్షోభంలో ప్యాసింజర్‌ వాహనాలు కొనుగోళ్లు భారీగా పడిపోగా ఇప్పుడు పెరుగుతున్నాయి.  

Advertisement

What’s your opinion

Advertisement