తిరుమల: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

తిరుమల: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

Published Thu, Oct 12 2023 9:18 AM

TTD Special Arrangements For Tirumala Navratri Brahmotsavam - Sakshi

సాక్షి తిరుమల: తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇక, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా  నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు టీటీడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టింది. 

ప్రత్యేక దర్శనాలు రద్దు..
►నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.  
►అక్టోబరు 19న గరుడసేవ, 
►20న పుష్పక విమానం, 
​​​​​​​►2​​​​​​​​​​​​​​​​​​​​​2న స్వర్ణరథం, 
​​​​​​​►అక్టోబర్ 23న చక్రస్నానం
​​​​​​​►అక్టోబర్ 19న గరుడసేవ సందర్భంగా ఆ రోజు ద్విచక్ర వాహనాలను అనుమతి లేదు.
​​​​​​​►3,500 మంది పోలీసులు, 1500 విజిలెన్స్ సిబ్బందితో బందోబస్తు
​​​​​​​►గడ్డ వాహనానికి అదనపు భద్రత
​​​​​​​►భక్తులందరికి గరుడోత్సవం దర్శనానికి టీటీడీ ప్రత్యేక కార్యాచరణ
​​​​​​​►రెండు లక్షలమంది గ్యాలరీలో వాహనా సేవలు వీక్షించేలా చర్యలు
​​​​​​​►నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు  ఉదయం 8 గంటల నుండి 10 గంటలు వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు ఊరేగింపు
​​​​​​​►నవరాత్రి బ్రహ్మోత్సవాలలో రథోత్సవానికి బదులుగా బంగారు తేరు
​​​​​​​►ధ్వజారోహణ ఉండదు

సర్వ దర్శనానికి 8 గంటలు..
ఇదిలా ఉండగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 12 ‍కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 72,230 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామి వారికి తలనీలాలు సమర్పించిన భక్తులు సంఖ్య 27,388. బుధవారం స్వామి వారి హుండీ అధాయం 3.74 కోట్లుగా ఉంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement