జయహో బీసీ: ‘రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాముల్ని చేశాను’ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ జయహో బీసీ మహాసభ.. లైవ్‌ అప్‌డేట్స్‌

Published Wed, Dec 7 2022 8:28 AM

YSRCP Jayaho BC Mahasabha 2022 Live Updates - Sakshi

జయహో బీసీ మహాసభ.. లైవ్‌ అప్‌డేట్స్‌


సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం
► 
ప్రతి గడపకు వాస్తవ పరిస్థితిని తీసుకెళ్లాలి. మంచి జరిగితేనే జగనన్నకు తోడు ఉండండని చెప్పండి. చంద్రబాబు అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పండి

► వైఎస్‌ఆర్‌సీపీ సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. మానవతా వాదానికి వైఎస్‌ఆర్‌సీపీ ప్రతీక. నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతోంది.

► 2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలే. మనమంతా మారీచులు, పెత్తందారులతో యుద్ధం చేయక తప్పదు. చంద్రబాబు, ఆయన బ్యాక్‌బోన్‌ ఎల్లో బ్రదర్స్‌, దత్తపుత్రుడు ఏ సామాజిక వర్గానికి ప్రతినిధులో ఆలోచన చేయాలి. 

రెండో విడత కేబినెట్‌లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. కేబినెట్‌లో పదకొండు మంది బీసీ మంత్రులు ఉన్నారు. కేబినెట్‌లో 56 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్థానం కల్పించాం. 

► చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపించలేదు. కానీ, మన ప్రభుత్వం ప్రతీ అడుగులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించాం. ఈ మూడున్నరేళ్లలో ఎనిమిది రాజ్యసభ స్థానాలు దక్కితే.. సగం బీసీలకే ఇచ్చాం. 

► ఎస్సీల్లో ఎవరైనా పుడతారా? అని చంద్రబాబు హేళన చేశారు. కానీ, మన హయాంలో అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకున్నాం.

► వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో ఆత్మ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమమే. గడప గడపకు నవరత్నాలు అందించడమే లక్ష్యం.

► చరిత్రలో ఎవరూ వేయని విధంగా అడుగులు వేశాం. బీసీ కులాలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేశాం.

► టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. కానీ, మన పాలనలో రాజ్యాధికారంలో బీసీలు భాగస్వామ్యం అయ్యారు.
► ఖబడ్దార్‌ మీ అంతు చూస్తా అని బీసీలను చంద్రబాబు బెదిరించాడు. తోకలు కత్తిరిస్తానన్నాడు. కానీ, బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములనే విషయం చంద్రబాబుకు చెప్పండి. 

► మీ బిడ్డ జగన్‌ వయసు 49 ఏళ్లు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అవుతోంది. కానీ, 2024లో ఒంటరిగా పోటీ చేస్తానని చంద్రబాబు చెప్పలేకపోతున్నారు.

నా బీసీ కుటుంబం.. గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్వాగతం. బీసీలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నాగరికతకు పట్టుకోమ్మలు బీసీలు. నా బీసీ కుటుంబం జనసముద్రంలా నా ముందు ఉంది. మీ హృదయంలో జగన్‌.. నా హృదయంలో మీరు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసులు కాదని..  బ్యాక్‌బోన్‌ క్లాసులు అని, వెనుకబాటు కులాలు కాదని.. వెన్నెముక కులాలు అని చాటిచెప్పే అడుగులు.
  
బీసీ అంటే శ్రమ.. బీసీ అంటే పరిశ్రమ. ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయానికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉంది. పారిశ్రామిక విప్లవం బీసీలను వెనక్కి నెట్టింది. ఆధునిక విద్య బీసీలను వెనకబాటుకు గురి చేసింది. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు.. వెన్నెముక కులాలు చేస్తానని చెప్పాను. నేడు రాజ్యాధికారంలో వారిని భాగస్వాముల్ని చేశాను: సీఎం జగన్‌

సీఎం జగన్‌ ప్రసంగం ప్రారంభం.. బీసీ సోదరులకు, అక్కచెల్లెమ్మలకు హృదయపూర్వక కృతజ్ఞతలతో మహాసభను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారాయన.

 నేతల ప్రసంగాలు పూర్తి కావడంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. అందరికీ అభివాదం తెలిపారు. చివరగా.. సీఎం వైఎస్‌ జగన్‌ను ప్రసంగానికి ఆహ్వానించారు.


► సీఎం జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహించారు. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పేదవాళ్లను చదువకు దగ్గర చేసిన ఘనత ఆయనది. ఒక యజ్ఞంలా సీఎం జగన్‌.. ఎన్నో సంక్షేమాలను ప్రజలు అందించారు.   సీదిరి అప్పలరాజు గుర్తు చేశారు. 

► మళ్లీ జగన్‌నే గెలిపించుకుందాం
సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోనే సామాజిక న్యాయం జరిగిందని ఎమ్మెల్సీ పోతుల సునీత పేర్కొన్నారు. ఇక్కడి బీసీ నినాదాలు చంద్రబాబు గుండెల్లో వణుకు పుట్టించాలన్నారు ఆమె. బీసీల కోసం ఇంతలా కష్టపడే ముఖ్యమంత్రిని ఎవరం చూడలేదని ఆమె పేర్కొన్నారు. ధర్మానికి-అధర్మానికి.. నిజానికి-అబద్ధానికి రాబోయే రోజుల్లో యుద్ధానికి సిద్ధం కావాలని బీసీలను కోరారు ఆమె. సంక్షేమ పథకాలు కొనసాగాలన్న.. మంచి పాలన అందాలన్నా సీఎం జగన్‌నే మళ్లీ సీఎంగా చేసుకుందామని, దుష్టచతుష్టయానికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఆమె పిలుపు ఇచ్చారు.

► 2024 ఎన్నికలకు మేమంతా సిద్ధం
వచ్చే ఎన్నికలకు మేం సిద్ధం. సీఎం జగన్‌ 85వేల బీసీ సైన్యాన్ని తయారు చేశారు. ఈ సైన్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి.. మీకు అండగా ఉంటామన్న జగనన్న వెంట నడుద్దామని బీసీలను కోరారు మంత్రి జోగి రమేష్‌. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడిపై పంచ్‌లు పేల్చారు జోగి రమేష్‌. వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొలేని దద్దమ్మలు.. కుట్రలు చేస్తున్నారు. 2024లో 175కి 175 గెల్చి తీరుతాం అని ఆయన అన్నారు. 

► బీసీలకు సీఎం జగన్‌ ఇచ్చింది ఆల్‌టైం రికార్డు
లక్షమంది హాజరైన వైఎస్‌ఆర్‌సీపీ జయహో బీసీ మహాసభలో మాజీమంత్రి అనిల్‌యాదవ్‌ భావోద్వేగంగా మాట్లాడారు. బీసీలకు సీఎం జగన్‌ ఇచ్చిన సంక్షేమం.. ఆల్‌టైం రికార్డు. ఇదే వేదిక నుంచి ఆయన చంద్రబాబుకు చరకలు అంటించారు. చంద్రబాబు డీఎన్‌ఏలో ఉంది కుళ్లు, కుతంత్రం తప్ప మరేమీ లేదు. చంద్రబాబుకు బీసీలు వణుకు పుట్టిస్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్‌ను గెలిపించి తీరతాం.. 175కి 175లో గెలిపిద్దాం అని బీసీలకు పిలుపు ఇచ్చారు అనిల్‌ యాదవ్‌.

► ఇవాళ బీసీల పండుగ. బీసీల తలరాతలు మార్చిన మహానేత సీఎం జగన్‌ అని మంత్రి గుమ్మనూరి జయరాం పేర్కొన్నారు.

► జయహో బీసీ మహాసభకు దాదాపుగా 80వేల మందికి పైగా బీసీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారని మంత్రి కారుమూరి తెలిపారు. చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా?అని నిలదీశారు. అన్ని బీసీ కులాలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్‌దే అని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు.  

► బీసీల పల్లకి మోస్తున్న మహానేత సీఎం జగన్‌ అని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్‌ పేర్కొన్నారు. పూలేకి సరిసమానమైన నేత జగన్‌ అని ఆమె కితాబిచ్చారు. 139 కులాలకు రాజ్యాధికారంలో స్థానం కల్పించారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌ది. ఆయన్ని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత బీసీలదే అని ఈ సందర్భంగా మంత్రి ఉషా శ్రీ చరణ్‌ పిలుపు ఇచ్చారు.  

► వెనుకబడిన కులాలే వెన్నెముక! నినాదంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బీసీ మహాసభను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల నుంచి భారీగా బీసీ ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులు ఈ సభకు హాజర్యారు. బీసీల నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగిపోయింది. సభా ప్రాంగణంలో బీసీలతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. 

11.31AM
వైఎస్‌ఆర్‌సీపీ జయహో బీసీ మహాసభ వేదికపైకి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌. అక్కడే ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే, మహానేత వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు పూల మాల వేసి నివాళులు అర్పించారు.


► బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. రాజకీయ గౌరవం ఇచ్చింది సీఎం జగన్‌ అని మంత్రి విడదల రజని పేర్కొన్నారు. సీఎం జగన్‌ బీసీ బాంధవుడు. చంద్రబాబు బీసీల పట్ల రాబందు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని అన్నారామె.

విజయవాడ జయహో బీసీ మహాసభ.. ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌


► వార్డు మెంబర్‌ నుంచి రాజ్యసభ వరకు బీసీలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్‌ది. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ఆశాజ్యోతి పూలే, అంబేద్కర్‌ భావజాలం ఆయనది.  చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మింగేస్తారు అని ఎంపీ మార్గాని భరత్‌ పేర్కొన్నారు. 
 


► బీసీల్లో పేదరికాన్ని తొలగించేందుకు సీఎం జగన్‌ కృషి చేస్తున్నారు. బీసీల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. చదవుకు పేదరికం అడ్డుకావొద్దని ఆయన భావించారు: ఎంపీ మోపిదేవి


► బీసీలే ఈ రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్‌ భావించారు
తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా అని చంద్రబాబు బీసీలను బెదిరించారు. కానీ, బీసీలే రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్‌ భావించారు. బీసీలకు సీఎం జగన్‌ ఏం చేశారో ఈ సభను చూస్తే తెలుస్తుందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. బీసీలే ఈ రాష్ట్రానికి వెన్నెముక అనే భావజాలాన్ని తెచ్చింది కూడా సీఎం జగనే అని పార్థసారథి పేర్కొన్నారు. 

బీసీలే రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్‌ భావించారు. రాష్ట్రంలో బీసీలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారు. గతంలో కాళ్లు అరిగేలా తిరిగినా సంక్షేమ పథకాలు వచ్చేవి కావు. కానీ,  జగన్‌ పాలనలో ఇంటి గడపకే సంక్షేమ పథకాలు వస్తున్నాయి. బీసీ రిజర్వేషన్‌ బిల్లు పెట్టిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమే అని పార్థసారథి పేర్కొన్నారు.


► బీసీలు బాబుకి బుద్ధి చెప్పాలి: స్పీకర్‌ తమ్మినేని
జయహో బీసీ మహాసభలో ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తామన్నారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ ఏకంగా లేఖ రాశాడు. కానీ, సీఎం జగన్‌ బీసీలకు గొప్ప ఆత్మగౌరవం ఇచ్చారు. బీసీలకు సమున్నత స్థానం కల్పించారు. చరిత్ర తెలియనివాళ్లు బీసీల తోకలు కత్తిరిస్తారా?బీసీలు జడ్జిలుగా పనికి రారా? ముసుగులు వేసుకుని మారువేషంలో వస్తున్నారు జాగ్రత్త.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బీసీలు బుద్ధి చెప్పాలి అని తమ్మినేని పిలుపు ఇచ్చారు. 

బీసీలకు పదవులిచ్చి ప్రొత్సహించింది సీఎం జగన్‌. ఎంపీపీ పదవుల్లో 67 శాతం పదవులు కల్పించారు. బీసీలకు 56 కార్పొరేషన్లు కేటాయించారు. బీసీలంతా ఆలోచించుకుని.. సీఎం జగన్‌ వెంట నడవాలని తమ్మినేని సీతారాం బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు స్పీకర్‌ తమ్మినేని. 
 


► పదకొండు తరాల వెనుకబాటు తనానికి కారణం చంద్రబాబు
కష్టం నా కులం అన్నాడు. మానవత్వం నా మతమన్నాడు. వ్యక్తిత్వం నా వర్గమన్నాడు. అదీ జగనంటే.. అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ పేర్కొన్నారు. ‘‘బీసీల పక్షపాతి సీఎం జగన్‌. రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన వ్యక్తి కూడా. 139 బీసీ కులాలను ఏకం చేసిన నేత. చంద్రబాబు నాయుడు కేవలం కుల వృత్తులకే బీసీలను పరిమితం చేయాలనుకున్నాడు. పదకొండు తరాల వెనుకబాటుకి కారణం అయ్యాడు. కానీ, సీఎం జగన్‌ అలా కాదు’’ అంటూ ప్రశంసలు గుప్పించారు మంత్రి చెల్లుబోయిన.

► విజయవాడ దారులన్నీ జయహో బీసీ మహాసభ వైపే వెళ్తున్నాయి. సభ కోసం భారీ సంఖ్యలో బీసీలు తరలి వస్తున్నారు. బీసీ జయ జయ నాదాలతో విజయవాడ మారుమోగిపోతోంది. 80 వేల మంది అంచనాని దాటేసి.. సుమారు లక్ష మంది దాకా సభకు హాజరు అయ్యారు. 

► ఆయనేమో బీసీలను చిన్నచూపు చూశారు
బీసీలకు సీఎం జగన్‌ సముచిత స్థానం కల్పించారు. బీసీలంతా సీఎం వైఎస్‌ జగన్‌ వెంటనే ఉన్నారు. బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు కల్పించిన ఘతన సీఎం జగన్‌దే. బీసీలను చంద్రబాబు చిన్నచూపు చూశారు. కించపరిచారు. అలాంటిది.. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి సీఎం జగన్‌ అని ఎంపీ గోరంట్ల మాధవ్‌ తెలిపారు. 

► బీసీల ఆత్మగౌరవమే కాదు.. అభివృద్ధి జరిగింది
ఏపీలో బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్‌ అని  వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీలకు ఆత్మగౌరవాన్ని మాత్రమే కాదు.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది సీఎం జగనే అని ఉద్ఘాటించారాయన. మాయమాటలకు లొంగిపోకుండా.. మన అభివృద్ధికి పాటుపడుతున్న నిజమైన నేత వైఎస్‌ జగన్‌కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. 

► బడుగు బలహీన వర్గాల పక్షపాతి సీఎం జగన్‌
వైఎస్‌ఆర్‌సీపీ ‘జయహో బీసీ మహాసభ’ ప్రారంభోపన్యాసాన్ని చేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బీసీ స్థితిగతులను మార్చేసిన వ్యక్తి సీఎం జగన్‌. సంచార జాతులను గుర్తించిన ఏకైక సీఎం కూడా ఈయనే. సీఎం జగన్‌ తన పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కేబినెట్‌లో పదకొండు మంది బీసీలకు స్థానం కల్పించారు. రాజ్యసభ పదవుల్లో సగం బీసీలకే ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల పక్షపాతి సీఎం జగన్‌’’ అని కొనియాడారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.

09.35AM
► వైఎస్‌ఆర్‌సీపీ జయహో బీసీ మహాసభ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రారంభం అయ్యింది. బీసీ నేతలంతా కలిసి జ్యోతి ప్రజల్వనతో ప్రారంభించారు. అనంతరం ప్రసంగోపన్యాసం సాగుతోంది.

► బీసీలంతా సీఎం వైఎస్‌ జగన్‌ వెంటే ఉన్నారు - మంత్రి కారుమూరి

► 14 ఏళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు బలహీనవర్గాలను కట్టుబానిసలుగా వాడుకున్నారు. బీసీలకు ఏపీలో మాత్రమే న్యాయం జరిగింది. బీసీ మహాసభ చరిత్రలో నిలిచిపోతుంది. 
- జోగి రమేష్‌

► వెనుకబడిన కులాలే వెన్నెముక! నినాదంతో ఇవాళ(బుధవారం) విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జయహో బీసీ మహాసభను నిర్వహిస్తోంది అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు సభ కోసం తరలి వచ్చారు.. ఇంకా వస్తూనే ఉన్నారు.

► జయహో బీసీ మహాసభకు సీఎం జగన్‌ హాజరై.. ప్రసంగించనున్నారు. 

► వైఎస్‌ఆర్‌సీపీ మినీ ప్లీనరీ తరహాలో ‘జయహో బీసీ మహాసభ’కు భారీ ఏర్పాట్లు చేశారు. 

► బీసీ ప్రజాప్రతినిధులు వేలాదిగా తరలి రానున్నారు. భారీ సంఖ్యలో వచ్చే వారి కోసం అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేశారు.

► జయహో బీసీ మహాసభకు హాజరయ్యే వాళ్ల కోసం విజయవాడ, గుంటూరు హోటళ్లు, కమ్యూనిటీ హాళ్లలో వసతి ఏర్పాటు చేశారు. 

► బీసీ మహాసభ సందర్భంగా.. విజయవాడలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుచోట్ల ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించారు. 

► బీసీలను సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దడమే లక్ష్యమని 2019 ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో చేసిన ప్రకటనను సీఎం జగన్‌ ఆచరించి చూపుతున్నారు.  ఎన్నికల హామీలకు మించి అత్యధికంగా బీసీలకు ప్రయోజనం చేకూర్చారు సీఎం జగన్‌.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

తప్పక చదవండి

Advertisement