షోలాపూర్‌–తిరుపతి రైళ్ల గడువు పొడిగింపు | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 25 2023 8:56 AM

- - Sakshi

కడప కోటిరెడ్డిసర్కిల్‌: షోలాపూర్‌–తిరుపతి–షోలాపూర్‌ (01437/38) స్పెషల్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ గడువును జూన్‌ 30వ తేదీ వరకు పొడిగించామని చీఫ్‌ టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉమర్‌బాష తెలిపారు. ఈ రైలు ఈనెల 17వ తేదీ వరకు రాకపోకలకు గడువు ముగిసిందని, ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా గడువును పొడిగించారని తెలిపారు. షోలాపూర్‌ జంక్షన్‌లో గురువారం రాత్రి 9.40 గంటలకు బయలుదేరి శుక్రవారం చేరుకుని, అదేరోజు రాత్రి 9.10 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుందన్నారు. ఈ రైలు రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం మీదుగా షోలాపూర్‌కు చేరుతుందని వివరించారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు.

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

కడప ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్‌ ప్రయోగ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్మీడియట్‌ ఆర్‌ఐవో రమణరాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఏడాది కూడా ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను నాన్‌ జంబ్లింగ్‌ విధానంలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు రెండు దశల్లో ప్రాక్టికల్‌ పరీక్షలు జరగుతాయన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14,541 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నారన్నారు. ఇందులో ఎంపీసీకి సంబంధించి 9648 మంది, బైపీసీకి సంబంధించి 4893 మంది రాయనున్నారన్నారు. ఇందుకోసం ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో 101 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగుతాయని చెప్పారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ప్రాక్టికల్స్‌ మొదటి విడత ఈనెల 26 నుంచి మార్చి 2 వరకు, రెండో విడత మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు సెలవు దినాల్లో కూడా జరుగుతాయన్నారు. ఆర్‌ఐవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమును కూడా ఏర్పాటు చేశామన్నారు. సమస్యలుంటే 08562 244171 నంబర్‌కు ఫోన్‌ చేయాలని ఆర్‌ఐవో తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement