పాము కాటుతో యువకుడికి అస్వస్థత | Sakshi
Sakshi News home page

పాము కాటుతో యువకుడికి అస్వస్థత

Published Wed, Mar 22 2023 2:04 AM

- - Sakshi

మదనపల్లె : పాము కాటుతో యువకుడు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన మంగళవారం ములకలచెరువు మండలంలో జరిగింది. మండలంలోని కోటరెడ్డిగారిపల్లెకు చెందిన రమణారెడ్డి కుమారుడు రాజసింహ(26) పొలం వద్దకు వెళ్లాడు. మోటార్‌ వేసేందుకు బోరు దగ్గరకు వెళ్లగా.. అక్కడే ఉన్న పాము కాటు వేసింది. తీవ్ర అస్వస్థతకు లోనవగా, వెంటనే కుటుంబ సభ్యులు గమనించి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం కోలుకుంటున్నాడు.

జాతీయ స్థాయిలో

అవార్డు సాధించడమే లక్ష్యం

పులివెందుల టౌన్‌/రూరల్‌ : జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడమే లక్ష్యంగా సినిమాలలో నటిస్తున్నట్లు సినీ నటుడు నాగ మహేష్‌ పేర్కొన్నారు. పులివెందులలో ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మంగళవారం తన మనోభావాలు పంచుకున్నారు. 2016లో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్‌ 150 సినిమాలో తనకు సినిమా అవకాశం వచ్చిందన్నారు. అప్పటి నుంచి రంగస్థలం, అరవింద సమేత, గాడ్‌ ఫాదర్‌, అఖండ, వీరసింహారెడ్డి, సార్‌ సినిమాలతోపాటు సుమారు 60 సినిమాలలో పలు పాత్రలలో నటించానని పేర్కొన్నారు. గాడ్‌ ఫాదర్‌, ఖైదీ నెంబర్‌ 150 సినిమాలతోపాటు అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు తనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో పుట్టిన నాకు చిన్నప్పటి నుంచి సినిమాలో రాణించాలన్న ఆసక్తితో నాటకాలలో ప్రదర్శనలు చేశానని చెప్పారు.

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మదనపల్లె : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన మంగళవారం పట్టణంలో జరిగింది. నిమ్మనపల్లె మండలం బండ్లపై పంచాయతీ భూమలగడ్డకు చెందిన దివాకర్‌ శౌరి(45) మంగళవారం వ్యక్తిగత పనులపై మదనపల్లెకు వచ్చాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన అతను చిత్తూరు బస్టాండ్‌ వద్ద పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వన్‌టౌన్‌ పోలీసులు విచారణ చేస్తున్నారు.

‘సాక్షి’తో సినీ నటుడు నాగ మహేష్‌ వెల్లడి

Advertisement
Advertisement