విజ్ఞానాన్ని వెలికితీయండి | Sakshi
Sakshi News home page

విజ్ఞానాన్ని వెలికితీయండి

Published Tue, Oct 31 2023 1:08 AM

పోస్టర్లను విడుదల చేస్తున్న కలామ్స్‌ విజన్‌ 2023 సభ్యులు - Sakshi

రాయచోటి టౌన్‌ : విద్యార్థులలో దాగి ఉన్న వి/్ఞానాన్ని వెలికి తీసి వారిలో సృజనాత్మకతను పదును పెట్టేందుకు సైన్స్‌ కలామ్స్‌ విజన్‌ 2023 ఉపయోగపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రాం పురుషోత్తం అన్నారు. సోమవారం రాయచోటి పట్టణంలోని ప్రతిభ జూనియర్‌ కళాశాల అవరణలో కలామ్స్‌ విజన్‌ 2023 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో వి/్ఞానం దాగి ఉంటుందని ఆ వి/్ఞాన్ని వెలికి తీసి ఆవిష్కరింపజేయాలన్నారు. ప్రతిభా జూనియర్‌ కళాశాల చైర్మన్‌ అరమాటి శివగంగిరెడ్డి మాట్లాడుతూ మానవుడి మనుగడకు సైన్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని అలాంటి సైన్స్‌పై విద్యార్థులకు ఆసక్తి పెంచే విధంగా సైన్స్‌ వి/్ఞాన కేంద్రాలను పరిచయం చేయాలని సూచించారు. ఈ సైన్స్‌ స్పేర్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, కార్పోరేట్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొనవచ్చుని, ఈ సైన్స్‌ఫేర్‌ నవంబర్‌ 28,29వ తేదీలలో రాయచోటిలోని ఇంటర్నేషనల్‌ మెరిట్‌ హైస్కూల్‌లో నిర్వహిస్తామని నిర్వహకుడు కలామ్స్‌ విజన్‌ 2023 వినయ్‌కుమార్‌ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281453550, 93919 32752 నంబర్లలో ఫోన్‌ చేయాలని సూచించారు.

Advertisement
Advertisement