ఎన్నికల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన

Published Fri, Nov 10 2023 5:36 AM

ఓటు వేస్తున్న విద్యార్థిని  - Sakshi

రాజంపేట టౌన్‌: రాజంపేట బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు ఎన్నికల నిర్వహణపై గురువారం అవగాహన కల్పించారు. ఉపాధ్యాయురాలు ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో మాక్‌ పోలింగ్‌(మాదిరి ఎన్నికలు) నిర్వ హించారు. విద్యార్థి ప్రతినిధి పదవికి 14 మంది నామి నేషన్లు దాఖలు చేశారు. ఐదుగురు ఉపసంహరించుకోగా తొమ్మిది మంది బరిలో నిలిచారు. ఎంఈఓలతోపాటు ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించారు. 462 ఓట్లకుగానూ 320 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 102 ఓట్లు సాధించిన తొమ్మిదో తరగతి విద్యార్థిని శ్రీహిత గెలుపొందారు. ఎన్నికలకు ఎన్నికల అధికారులు, ఏజెంట్లుగా విద్యార్థులే విధులు నిర్వర్తించారు. ఎంఈఓ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో ఎన్నికల పట్ల అవగాహన పెంచుతాయన్నారు. హెచ్‌ఎం జయలక్ష్మీ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement