ఇంటింటా వెలుగులు నిండాలి | Sakshi
Sakshi News home page

ఇంటింటా వెలుగులు నిండాలి

Published Sun, Nov 12 2023 1:30 AM

ప్రాజెక్టు నిర్వహణ కరపత్రాలు విడుదల చేస్తున్న అధికారులు, నిర్వహకులు - Sakshi

– దీపావళి సందర్భంగా ప్రజలకు ప్రజా

ప్రతినిధులు, అధికారుల శుభాకాంక్షలు

రాయచోటి : చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే దీపావళి పండుగతో.. ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి, కలెక్టర్‌ గిరీషా పీఎస్‌, శాసన సభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శాసన మండలి ఉపాధ్యక్షురాలు జకియా ఖానం, జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ జిల్లా వాసులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. టపాసులు కాల్చే సమయంలో పిల్లలు, పెద్దలు జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలందరూ సంతోషంగా పండగ జరుపుకోవాలని కోరారు.

24 నుంచి కలాంవిజన్‌–2023

రాయచోటిటౌన్‌ : ఈ నెల 24, 25వతేదీల్లో కలాం విజన్‌–2023 సైంటిఫికల్‌ ప్రాజెక్టు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈఓ శ్రీరాం పురుషోత్తం, ప్రోగ్రాం డైరెక్టర్‌ వినయ్‌కుమార్‌ పేర్కొన్నారు. డీఈఓ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆయన శనివారం వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 28, 29వ తేదీన సమ్మెట్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలు ఉండడంతో ముందస్తుగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల యజమానులు గమనించాలని ఆయన కోరారు.

అరుణాచలం, శ్రీశైలానికి ప్రత్యేక సర్వీసులు

రాజంపేట : కార్తీకమాసంలో అరుణాచలం, శ్రీశైలానికి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నామని డిపో మేనేజర్‌ గుండాల రమణయ్య తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్తీక దీపదర్శనం నిమిత్తం ఈనెల 26న ఆదివారం ఉదయం 6గంటలకు డిపో నుంచి బస్సు సర్వీసు ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ చేసుకోవచ్చన్నారు. రానుపోను చార్జి రూ.1130గా నిర్ణయించామన్నారు. అలాగే మూడురోజుల పంచారామాల దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆర్టీసీ అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట, కనకదుర్గమ్మ, మంగళగిరి నరసింహస్వామి టూర్‌ ప్యాకేజీ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. టికెట్‌ రూ.3వేలు ఉంటుందన్నారు. రెండురోజుల టూర్‌ను ఖరారు చేసామని, ఇందులో శ్రీశైలం, మహానంది, నందవరం, యాగంటి, రవ్వలకొండలను దర్శనం చేయిస్తామన్నారు. రూ.1700 టికెట్‌ ధరగా నిర్ణయించామన్నారు. కార్తీకమాసాన్ని దృష్టిలో ఉంచుకొని నాలుగు వారాలు స్పెషల్‌ సర్వీసును నడుపుతున్నామన్నారు. భక్తులు రామయ్య (7382868300), ఆర్‌వీబీరాజు(7981738566) నంబర్లను సంప్రందించాలని డీఎం సూచించారు.

పక్కాగా ఫీవర్‌ సర్వే

సంబేపల్లె : మండలంలోని నారాయణరెడ్డి పల్లిలో ఫీవర్‌ సర్వేను జిల్లా వైద్యాధికారి కొండయ్య తనిఖీ చేశారు. పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.

నీటి ట్యాంక్‌ను పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారి
1/3

నీటి ట్యాంక్‌ను పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారి

ఎంపీ మిథున్‌రెడ్డి
2/3

ఎంపీ మిథున్‌రెడ్డి

ఎమ్మెల్యే గడికోట
3/3

ఎమ్మెల్యే గడికోట

Advertisement
Advertisement