బాబోయ్‌.. భూ దొంగలు! | Sakshi
Sakshi News home page

బాబోయ్‌.. భూ దొంగలు!

Published Thu, Nov 23 2023 12:06 AM

- - Sakshi

వాళ్లు మా ఊరివాళ్లు కాదు

మా గ్రామంలో పలువురు రైతుల పేరుతో ఉన్న భూములకు అను బంధంగా సర్వేనెంబర్లు సృష్టించి లేని భూములు ఉన్నట్లుగా చూపించిన మగ్గురు రైతులు మా ఊరికి చెందిన వారుకారు. వారిని ఎప్పుడు మేము చూడలేదు. మా పేర్లతో ఉన్న భూము ల్లో వారు లేని సర్వేనెంబర్లు చూపించి భూము లు ఉన్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం దారుణం. – బాలిరెడ్డి, రైతు, టి.రాచపల్లె

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

మా గ్రామంలోని రైతుల పేర్లతో ఉన్న భూములను తమ పేర్లతో బినా మీ సర్వేనెంబర్లు సృష్టించి ఆన్‌లైన్‌లొ నమోదు చేసుకొన్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. విచారణ జరపకుండా అధికారులు వారికి ఎలా పట్టాదారుపాసుపుస్తకాలు ఇచ్చారో అర్థం కావడం లేదు. ఇదే భూములను చూ పించి బ్యాంకులను బురిడి కొట్టించి రుణాలు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి.

– అశోక్‌కుమార్‌రెడ్డి, రైతు, టి.రాచపల్లె

గుర్రంకొండ మండలంలో నకిలీ పాసు పుస్తకాల బాగోతం వెలుగు చూసింది. భూ దొంగలు అనుబంధ సర్వే నంబర్లు సృష్టించి పాసు పుస్తకాలు పొందడమే కాకుండా

ఏంచక్కా బ్యాంకుల్లో లక్షల రుణాలూ పొందారు. గుర్రంకొండ మండలం టి.రాచపల్లెలో ఇటీవల జరిపిన భూ రీసర్వేలో ఈ నిజాలు వెలుగు చూశాయి. ఈ తతంగం నడిపిందెవరు? ఇందులో అధికారుల పాత్ర ఎంత? నేతల ప్రమేయం ఏమైనా ఉందా? అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.

గుర్రంకొండ: గుర్రంకొండ మండలం టి.రాచపల్లె పంచాయతీలోని 11 మంది రైతులకు పక్కనున్న రామాపురం గ్రామంలో పొలాలు ఉన్నాయి. ఇటీవల రెవెన్యూ అధికారులు సదరు పంచాయతీలో భూ రీసర్వే కార్యక్రమం నిర్వహించారు. పొలాలున్న రైతులందరు తమ పొలాల వద్దకు రావాల్సిందిగా కోరారు. సదరు 11 మంది రైతులు పొలాల వద్ద ఉండగా రెవెన్యూ రికార్డుల్లో మరో ముగ్గురు రైతులు ఉన్నట్లు గుర్తించారు. ఆ ముగ్గురు తమ గ్రామానికి చెందిన వారని కారని వారికి తమ భూముల సర్వేనెంబర్లలో వారికి భూములు ఎలా వచ్చాయని రెవెన్యు అధికారులను ప్రశ్నించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం తాము భూసర్వేకు వచ్చామని వారు చెప్పా రు. దీంతో రైతులు బినామీరైతుల వన్‌బీల ఆధారంగా విచారణ చేయగా నిజాలు బయటపడ్డాయి.

● మదనపల్లెకు చెందిన హరికృష్ణ, చంద్రమోహన్‌, రామసముద్రం మండలానికి చెందిన చౌడప్ప గుర్రంకొండ మండలం టి.రాచపల్లెకు చెందిన సదరు 11 మంది రైతుల భూములకు సంబంధించిన సర్వేనెంబర్లలో బినామీ నెంబర్లు సృష్టించి లేని భూములను ఉన్నట్లుగా సృష్టించారు. వీరికి దరఖాస్తు చేసుకున్నదే తడవుగా రెవెన్యూ అధికారులు 2017 ఫిబ్రవరి 13న వీరికి ఒన్‌బీ, అడంగళ్‌, కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశారు. సదరు బినామీ వ్యక్తులు సదరు పట్టాదారు పాసు పుస్తకాలు చూపించి హెచ్‌డీ ఎఫ్‌సీ బ్యాంకుల్లో హరికృష్ణ పేరుతో రూ. 13.50 లక్షలు, చౌడప్ప పేరుతో రూ. 8.50లక్షలు, చంద్రమోహన్‌ పేరుతో రూ.7.50లక్షలు రుణాలు పొందారు.

పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం

టి.రాచపల్లెలో జరిన భూ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం. గతంలో రెవెన్యూ అధికారులు వా రికి ఏ ప్రాతిపదికన పట్టాదా రు పాసుపుస్తకాలు మంజురు చేశారో విచారణ చేస్తాం. బాధిత రైతులు ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

– ఖాజాబీ. తహసీల్దార్‌, గుర్రంకొండ

వెలుగులోకి నకిలీ పాసు పుస్తకాల దందా

గుర్రంకొండలో భూ రీసర్వేలో వెలుగుచూసిన నిజాలు

1/4

2/4

3/4

4/4

Advertisement

తప్పక చదవండి

Advertisement