ఆర్‌బీకే ఆకస్మిక తనిఖీ | Sakshi
Sakshi News home page

ఆర్‌బీకే ఆకస్మిక తనిఖీ

Published Thu, Nov 23 2023 12:06 AM

- - Sakshi

ఓబులవారిపల్లె: ఆర్‌బీకేల ద్వారా అన్ని రకాల ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి బి.చంద్రనాయక్‌ అన్నారు. చిన్నఓరంపాడు రైతు భరోసా కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మల్లిక, రైతు భరోసా కేంద్రం ఇన్‌చార్జ్‌ నందిని తదితరులు పాల్గొన్నారు.

నేడు కళ్యాణమస్తు

నిధులు విడుదల

రాయచోటి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులను విడుదల చేయనున్నారు. నాలుగో విడత నవంబర్‌ 23లో వివాహం చేసుకున్న అర్హులైన 342 జంటల ఖాతాలలో రూ. 2.76 కోట్లు ఆర్థిక సాయాన్ని వధువు తల్లుల బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ ఆధ్వర్యంలో అర్హులకు అందజేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నియోజకవర్గాల వారీగా వివరాలిలా..

రాయచోటిలో 72 జంటలకు రూ. 62.10 లక్షలు, రాజంపేట 48 గంటలకు రూ. 32.20 లక్షలు, కోడూరు 52 జంటలకు రూ. 40.72 లక్షలు, మదనపల్లి 50 గంటలకు రూ. 39.35 లక్షలు పీలేరు 74 జంటలకు రూ. 61 లక్షలు, తంబళ్లపల్లె 46 జంటలకు రూ.35.65 లక్షలు అందజేయనున్నారు.

కోటి దీపోత్సవానికి రామయ్య

ఒంటిమిట్ట: హైదరాబాద్‌లో గురువారం జరిగే కోటి దీపోత్సవంలో సీతారాముల కల్యాణానికి ఒంటిమిట్ట రామయ్య ఉత్సవమూర్తులను తీసుకెళ్తున్నట్టు ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్‌ బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం మూడో శతాబ్దానికి చెందిన ఈ ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ హనుమంతయ్య తదితరులు పాల్గొన్నారు.

ఒంటిమిట్టకు అయోధ్య అక్షింతలు

ఒంటిమిట్టకు బుధవారం ఆర్‌ఎస్‌ఎస్‌ నేత వేణుగోపాల్‌రాజు ఆధ్వర్యంలో ఆయోధ్య రామ మందిరం నుంచి అక్షింతలు చేరాయి. వీటిని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉంచి నెల పాటు పూజలు చేస్తారు.

దరఖాస్తుల ఆహ్వానం

రాయచోటి: అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలలోని పర్యాటక రంగంలో ఉత్తమ పర్యాటక ప్రాంతాల ఎంపికకు గాను 2024 ఏడాదికి పర్యాటక మంత్రిత్వ శాఖ దరఖాస్తుల ద్వారా ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక రీజనల్‌ డైరెక్టర్‌ రమణప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పైన తెలిపిన జిల్లాలలోని వ్యవసాయ పర్యాటకం, బాధ్యతాయుత పర్యాటకం, వారసత్వ పర్యాటకం, కళాఖండాలు, శక్తివంతమైన గ్రామాలు, కమ్యూనిటీ ఆధారితం, ఆరోగ్య రంగాలకు సంబంధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా రీజనల్‌ డైరెక్టర్‌ రమణప్రసాద్‌ పేర్కొన్నారు. వివరాలకు తిరుపతి జిల్లా పర్యాటక అధికారి రూపేంద్రనాధరెడ్డి (6309942027), చిత్తూరు జిల్లా పర్యాటక అధికారి నరేంద్ర (9966535697), అన్నమయ్య జిల్లా పర్యాటక అధికారి నాగభూషణం(6309942032)లను సంప్రదించాలని పర్యాటక శాఖ ఆర్డీ తెలిపారు.

సీడీసీ బృందం పర్యటన

మదనపల్లె: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవా రం సెంటర్‌ ఫార్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) బృంద సభ్యులు పర్యటించారు. సీడీసీ టీం డాక్టర్‌.మెర్లీసా ఆధ్వర్యంలో వైద్య బృంద సభసభ్యులు రమేష్‌, తరుణ్‌, లోకేష్‌, వలంటరీ హెల్త్‌ సర్వీసెస్‌ సభ్యులు వెంకట్రామన్‌, సంపత్‌కుమా ర్‌, ఏపీ శాక్స్‌ పర్యవేక్షకుడు రాజేంద్రప్రసాద్‌ తదితరులు జిల్లా ఆస్పత్రిలోని ఏఆర్‌టీ, ఐసీటీసీ, ఎస్‌టీఐ, పీపీటీసీ, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ విభాగాల ను పరిశీలించారు. మదనపల్లెలోని ఏఆర్‌టీ, ఐసీ టీసీ విభాగాలు సమర్ధవంతంగా పనిచేయడంతో పాటుగా, రోగుల గోప్యత పాటించడం, కౌన్సి లింగ్‌, మెడిసిన్స్‌ అందించడంలో విశేష కృషి చేస్తున్నట్లు తెలిసిందన్నారు.ఇక్కడందిస్తున్న సేవలను పైలట్‌ ప్రాజెక్ట్‌గా అధ్యయనం చేసి దేశంలోని ఇతర ప్రాంతాల్లో అందించేందుకు చర్యలు చేప ట్టేలా ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. మెడికల్‌ సూపరింటెండెంట్‌ పద్మాంజలి, సర్జన్‌ హరగోపాల్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా ఆస్పత్రిలో సీడీసీ బృంద సభ్యుల పరిశీలన
1/1

జిల్లా ఆస్పత్రిలో సీడీసీ బృంద సభ్యుల పరిశీలన

Advertisement
Advertisement