టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

Published Mon, Dec 11 2023 1:04 AM

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి 
ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి  - Sakshi

రాయచోటిటౌన్‌ : గాలివీడు మండల పరిధిలోని ప్యారంపల్లె గ్రామం పెడకంటి కొత్తపల్లెలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలోఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో దాదాపు 30 కుటుంబాల వారు పార్టీ కండువాలు ధరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పరిపాలన పట్ల ఆకర్షితులై వారు పార్టీలో చేరినట్లు తెలిపారు. రాష్ట్రమంతటా వైఎస్సార్‌సీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆవుల నాగభూషణ్‌రెడ్డి, సర్పంచ్‌ సతీష్‌కుమార్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ మిట్టపల్లె యదుభూషణ్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ఖాదర్‌ వలీ, సర్పంచ్‌లు చెన్నకేశవుల రెడ్డి, ఉమాపతిరెడ్డి, సచివాలయ కన్వీనర్‌ రమణారెడ్డి, పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లాప్‌ట్యాప్‌ దొంగ అరెస్ట్‌

మదనపల్లె : హైటెక్‌ బస్సుల్లో ప్రయాణిస్తూ, తోటి ప్రయాణికులు ఆదమరిచి నిద్రపోయినప్పుడు అదును చూసుకుని లాప్‌ట్యాప్‌లను చోరీచేసే దొంగను ఆదివారం అరెస్ట్‌ చేసినట్లు టూ టౌన్‌ ఇన్‌చార్జి సీఐ వలీబాషు తెలిపారు. మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్‌లో ఇటీవల లాప్‌ట్యాప్‌ పోగొట్టుకున్న బాధితుడి ఫిర్యాదు మేరకు ఆర్టీసీ బస్టాండులోని సీసీ టీవీ పుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేశామన్నారు. అందులో మహారాష్ట్రకు చెందిన షేక్‌ జావిద్‌(34)ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో బస్సుల్లో లాప్‌ట్యాప్‌లు చోరీ చేస్తున్నట్లు తెలిసిందన్నారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.లక్ష విలువచేసే 6 ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

లాడ్జిలో అనారోగ్యంతో

వ్యక్తి మృతి

కడప అర్బన్‌ : కడప నగరంలోని పాతబస్టాండ్‌ సమీపంలో ఓ లాడ్జిలో ఈనెల 8వ తేదీన విశ్రాంతి తీసుకునేందుకు వచ్చిన డి. సుదర్శన్‌ శర్మ (42) అనే వ్యక్తి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనంతపురం జిల్లా గుంతకల్‌లోని తిలక్‌నగర్‌కు చెందిన మృతుడు కడపకు పనిమీద వచ్చాడు. అతని బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని రిమ్స్‌ మార్చురీకి తరలించారు.

వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించండి

అట్లూరు : వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని వీఆర్‌ఏ వెల్ఫేర్‌ అండ్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నల్లిపోగు నాగేశం తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisement
Advertisement