కలసికట్టుగా ఘన విజయం సాధిద్దాం | Sakshi
Sakshi News home page

కలసికట్టుగా ఘన విజయం సాధిద్దాం

Published Thu, Feb 22 2024 12:26 AM

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ మిథున్‌రెడ్డి  - Sakshi

పీలేరు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలసికట్టుగా పనిచేసి వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడానికి కృషి చేద్దామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక వీఎస్‌ఆర్‌ కల్యాణమండపంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరో 50 రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయని రాష్ట్రంలో అన్ని సర్వే సంస్థలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారం రాబోతోందని రిపోర్టు ఇచ్చాయని తెలిపారు. సీఎం జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి కావడం తధ్యమన్నారు. విభేదాలు పక్కన పెట్టి వచ్చే ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని కోరారు. కార్యకర్తలు, గ్రామ వలంటీర్లు కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

హ్యాట్రిక్‌ కొట్టబోతున్నాం

అందరి సహకారంతో పీలేరులో 2014లో 15 వేల ఓట్ల మెజార్టీ, 2019లో 7,800 మెజార్టీతో వైఎస్సార్‌సీపీ విజయం సాధించిందని తెలిపారు. 2024లో హ్యాట్రిక్‌ కొట్టబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లలో పీలేరులో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం, 12 వేల ఇళ్లు మంజూరు, అన్ని మతాలకు వేర్వేరుగా శ్మశాన స్థలాలు కేటాయించామని తెలిపారు. అలాగే పార్కు, బైపాస్‌ రోడ్డు, పట్టణంలో రెండు ఆర్‌ఓబీ నిర్మాణాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. పీలేరు నుంచే తమ రాజకీయ ప్రస్థానం మొదలైందని, ఇక్కడి ప్రజల అందదండలతోనే తాము రాజకీయంగా రాణించామని వారు గుర్తుచేశారు. అనంతరం గ్రామ పంచాయతీల వారీగా నాయకుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జి.వి. శ్రీనాథరెడ్డి, రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఇక్బాల్‌అహ్మద్‌, పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఏపీఎండీసీ డైరెక్టర్‌ హరీష్‌రెడ్డి, ఎంపీపీ సతీష్‌రెడ్డి, జెడ్పీటీసీ ఎ.టి.రత్నశేఖర్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ దండు జగన్‌మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ జీనత్‌షఫీ, నాయకులు జి.వి. రాకేష్‌రెడ్డి, డాక్టర్‌ వెంకటరామయ్య, సహదేవరెడ్డి, భాస్కర్‌నాయుడు, నాగరాజమ్మ, హబీబ్‌బాషా, హుమయూన్‌, మహితాఆనంద్‌, ఎన్‌.వి. చలపతి, హరిత, ఉదయ్‌, స్టాంపుల నరసింహారెడ్డి, విజయశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ వైఎస్సార్‌సీపీదే అధికారం

ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి

Advertisement
Advertisement