పది ఫలితాల్లో ప్రతిభ | Sakshi
Sakshi News home page

పది ఫలితాల్లో ప్రతిభ

Published Tue, Apr 23 2024 8:35 AM

పెనగలూరు : ప్రణయ్‌ కుమార్‌ను అభినందిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నీలకంఠరాజు    - Sakshi

పదో తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభకనబరిచారు. ఉపాధ్యాయులు ఉత్తమ బోధన అందజేయడంతో పాటు విద్యార్థులను పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం చేశారు. దీంతోపాటు తల్లిదండ్రుల ప్రత్యేక పర్యవేక్షణతో పట్టుదలతో చదివిన పిల్లలు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మెరుగైన మార్కులతో సత్తా చాటారు. ప్రతిభచూపిన విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.

రాయచోటి : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అన్నమయ్య జిల్లాలో 23 మంది విద్యార్థులు 580 మార్కులకు పైబడి సాధించి జిల్లా పేరు నిలబెట్టారు. ఈ మార్కుల సాధనలోనూ అమ్మాయిలు ఎక్కువ మంది ఉండడం విశేషం. జిల్లాలోని కలకడ ఎ.పి. రెసిడెన్షియల్‌కు చెందిన పందికుంట లిఖిత 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.

● బి.కొత్తకోట బాలికల హైస్కూల్‌లో ఎస్‌.థమన్నా 594 మార్కులు, మదనపల్లె ఎ.పి.డబ్ల్యూ బాలికల రెసిడెన్షియల్‌లో ఎం.దోనిక 594, గ్యారంపల్లి ఎ.పి.ఆర్‌.ఎస్‌ బాలురలో ఎస్‌.రూపేస్‌ 594, మదనపల్లిలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థి ఎం.చరిషారెడ్డి 592, పీలేరు ఎం.జె.పి.ఎ.పి.బి.సి.డబ్ల్యూ.ఆర్‌ బాలికల పాఠశాలలో జె.భార్గవి 592, సదుం మండలం చిన్నతిప్ప హైస్కూల్‌లో జి.గౌతమి 590 మార్కులు సాధించారు.

● పీలేరు మండలం కొత్తపల్లె బాలికల హైస్కూల్‌లో ఎం.షీమాఖానమ్‌ 588, వాయల్పాడు మండలం చెర్లోపల్లి హైస్కూల్‌లో ఎం.ఎస్‌.చేతన్‌కుమార్‌ నాయుడు 585, దేవపట్ల హైస్కూల్‌లో పి.మాధవి 585 మార్కులు సాధించారు.

● రాజంపేట బాలికల హైస్కూల్‌లో షేక్‌ జైబా 584, పీలేరు మెయిన్‌ జెడ్పీ హైస్కూల్‌లో ఎ.కురైన్‌ సుహ 584, కురబలకోట జెడ్పీ పాఠశాలలో కె.తబసమ్‌ 583, ముదివీడు ఎ.పి.మోడల్‌ స్కూల్‌లో ఎన్‌.రామచరణ్‌రెడ్డి 582, బురకాయలకోట జెడ్పీ హైస్కూల్‌లో ఎన్‌.హేమంత్‌కుమార్‌రెడ్డి 582 మార్కులు సాధించారు.

● రాజంపేట బాలికల హైస్కూల్‌లో ఆర్‌.ప్రణతి 582, పుల్లంపేట ఎ.పి మోడల్‌ స్కూల్‌లో ఎం.మౌనిక 582, ముదివీడు ఎ.పి.మోడల్‌ స్కూల్‌లో జి.లోక రక్షిత రెడ్డి 582, మదనపల్లి సమీపంలోని నీరుగట్టుపల్లి ఎం.పి.ఎల్‌ హెచ్‌.ఎస్‌లో బి.దీక్షిత 582, బి.హేమమాలిని 582, గ్యారంపల్లె ఎ.పి.ఆర్‌.ఎస్‌ బాలుర పాఠశాలలో ఎస్‌.వేణు 582, నడిమిచర్ల జెడ్పీ హైస్కూల్‌లో ఓ.లక్ష్మీ కృతిక 582, పీలేరు బాలికల ఎం.జె.పి.ఎ.పి.బి.సి.ఆర్‌ స్కూల్‌లో కె.రాఘప్రియ 582 వంతున మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. మంచి ఫలితాలను సాధించిన విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి శివ ప్రకాష్‌రెడ్డి, ఆయా మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు అభినందించారు.

రామాపురంలో..

రామాపురం : మండల కేంద్రంలోని ఏపీ మోడల్‌స్కూల్‌కు చెందిన వి. భవాని శంకర్‌ పదవ తరగతిలో 574 మార్కులు సాధించాడు. మండలంలో 349 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 261 మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు.

పెనగలూరు (ఓబులవారిపల్లె) : పెనగలూరు మండలం నల్లపరెడ్డిపల్లి హైస్కూల్‌కు చెందిన ప్రణయ్‌ కుమార్‌ 563, రూపా 562 మార్కులు సాధించారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నీలకంఠరాజు తెలిపారు. అలాగే మోడల్‌ స్కూల్‌లో 96 మంది విద్యార్థులకు గాను 88 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 92శాతం సాధించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ సహజ బ్లెస్సీ తెలిపారు. అందులో 7 మంది విద్యార్థులు 500 మార్కులు సాధించగా, ఫస్ట్‌ డివిజన్‌లో 74 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు.

టెన్త్‌లో 23 మంది విద్యార్థులకు

580కి పైగా మార్కులు

Advertisement
Advertisement