చంద్రబాబు పాలన అవినీతిమయం | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలన అవినీతిమయం

Published Tue, Apr 23 2024 8:40 AM

గుర్రంకొండ బహిరంగసభలో మాట్లాడుతున్న రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  - Sakshi

కలికిరి/గుర్రంకొండ/పీలేరు/కలకడ/కేవీపల్లె/

వాల్మీకిపురం: ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చిన ప్రతిసారీ ఆయన పాలన అవినీతిమయంగా మారిందని, గత ఐదేళ్ల పాలన కేవలం అమరావతి చుట్టూ తిరిగి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో దోచుకున్నారని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. సోమవారం అన్నమయ్య జిల్లాలోని కలికిరి, గుర్రంకొండ, వాల్మీకిపురం, పీలేరు, కలకడ, కేవీపల్లె పట్టణాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన సభలు, సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు. కలికిరి పట్టణ పరిధిలోని క్రాస్‌రోడ్డు హేమాచారి కల్యాణ మండపంలో జరిగిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యత కల్పించి, వైద్య రంగంలో 53వేల ఉద్యోగాల నియామకం చేపట్టారన్నారు. జిల్లాకు ఒక వైద్య కళాశాలలో భాగంగా 17 నూతన మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు.

కిషోర్‌ను ఎర్రచందనం దొంగ అనలేదా..!

పీలేరు నియోజకర్గ టీడీపీ అభ్యర్థి కిషోర్‌కుమార్‌ రెడ్డిని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎర్రచందనం దొంగ అని తిట్టిన విషయం ప్రజలు ఇంకా మరువలేదన్నారు. అలా తిట్టిన పార్టీ చెంతన చేరడం నల్లారి కుటుంబానికే చెల్లిందన్నారు. మరొకరు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ద్వారా చీఫ్‌విప్‌, సీఎం పదవులు అనుభవించి, పార్టీని గల్లంతు చేసి సమైక్యాంధ్ర పేరిట పార్టీ పెట్టి చెప్పులు మెడలో వేసుకుని తిరిగారన్నారు. పదేళ్ల తరువాత బీజేపీలో చేరి ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నాడో ఆయన వి/్ఞతకే వదిలేయాలన్నారు. పెద్దిరెడ్డిని తిడితే గుర్తింపు రాదని, ప్రజలకు మంచి చేస్తే గుర్తింపు వస్తుందని తెలుసుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పీవీ మిథున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిల గెలుపునకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి కోరారు. ఎంపీ అభ్యర్థి పీవీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్లీ సీఎంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రావాలన్నారు.

కూటమితో ముస్లిం మైనార్టీ రిజర్వేషన్‌లు రద్దు

రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే ముస్లింల 4శాతం రిజర్వేషన్‌లు రద్దుచేయడం ఖాయమని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ తెలిపారు. పక్క రాష్ట్రం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తూనే రిజర్వేషన్‌లు తొలగించనున్నట్లు బీజేపీ నేతలు అంటున్నారని, ఇక్కడా అదే జరుగుతుందని హెచ్చరించారు.

మతతత్వ పార్టీలను తరిమికొడదాం

ఈ సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ పార్టీలను తరిమికొడదామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పీలేరులోని ఎంఎన్‌ఆర్‌ కల్యాణ మండపంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలు వందశాతం అమలు చేశాకే ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. గతంలో చంద్రబాబు 600 హామీలు ఇవ్వడంతోపాటు, నూరు పేజీల మేనిఫెస్టో విడుదల చేసి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన సుమారు 50 కుటుంబాల ముస్లిం మైనారిటీలు మంత్రి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

సీఎం జగన్‌ పాలనలో అన్ని వర్గాలకూ మేలు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ మేలు జరిగిందని, సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమ వారం వాల్మీకిపురంలోని కువైట్‌ శంకరాచారి లేఅవుట్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నివాసముండే అన్నదమ్ములైన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కిషోర్‌కుమార్‌రెడ్డిలకు ఓట్లు అడితే హక్కు లేదన్నారు. ఇలాంటి వ్య క్తులకు ఓట్లు వేస్తే మళ్లీ తెలంగాణకు వెళ్లి కూర్చుంటారే తప్ప ప్రజా సేవ చేయరని దుయ్యబట్టారు.

● ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యండలపల్లి శ్రీనివాసులురెడ్డి, ఏపీ ఎండీసీ డైరెక్టర్‌ హరీష్‌రెడ్డి, నాయకులు నల్లారి తిమ్మారెడ్డి, నూర్జహాన్‌, పద్మజ, ఆఘామొహిద్దీన్‌, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ ఖాన్‌, పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, జి.వి. రాకేష్‌రెడ్డి, ఎంపీపీ కంభం సతీష్‌రెడ్డి, జెడ్పీటీసీ రత్నశేఖర్‌రెడ్డి, పరిశీలకుడు సహదేవరెడ్డి, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్‌ రవికుమార్‌రెడ్డి, ఎంపీపీ శ్రీదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు హారిక తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ వస్తేనే సంక్షేమ పథకాల కొనసాగింపు

రాష్ట్రంలో మరోసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే ఇప్పుడు అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియాఖానమ్‌ అన్నారు. సోమవారం గుర్రంకొండలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. మైనార్టీల సంక్షేమం కోసం జగనన్న ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మతతత్వ బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రానున్న ఎన్నికల్లో అందరూ బుద్ధి చెప్పాలన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీనిఅమలు చేయకపోవడం ఆయన నైజం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ గల్లంతుకు కిరణే కారణం

మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్‌లపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్‌

Advertisement
Advertisement