Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు

Published Sun, Apr 28 2024 6:31 AM

Daily Horoscope Rasi Phalalu April 28-04-2024 Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.చవితి ఉ.6.20 వరకుతదుపరి పంచమి, నక్షత్రం: మూల రా.2.56 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ఉ.10.56  నుండి 12.26 వరకు, తదుపరి రా.1.22 నుండి 2.58 వరకు, దుర్ముహూర్తం: సా.4.37 నుండి 5.25 వరకు, అమృతఘడియలు: రా.8.23 నుండి 10.42 వరకు.

సూర్యోదయం        :  5.40
సూర్యాస్తమయం    :  6.14
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం: కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మిథునం: సోదరులు, సోదరులతో సఖ్యత. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

సింహం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో తగాదాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

కన్య: రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగులకు పనిభారం.

తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. అంచనాలు నిజమవుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

వృశ్చికం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కుంభం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

మీనం: దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
 

Advertisement
Advertisement