Rasi Phalalu: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది | Today Telugu Horoscope On March 28th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది

Published Thu, Mar 28 2024 6:25 AM

Daily Horoscope: Rasi Phalalu On March 28 2024 In Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: బ.తదియ సా.4.29 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: స్వాతి సా.4.31 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: రా.10.28 నుండి 12.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.03 నుండి 10.51 వరకు తదుపరి ప.2.57 నుండి 3.45 వరకు, అమృతఘడియలు: ఉ.7.02 నుండి 8.43 వరకు

మేషం: మీ కృషి ఫలిస్తుంది. పనుల్లో విజయం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సజావుగా సాగుతాయి.

వృషభం: పాతబాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలం.

కర్కాటకం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత సానుకూలం.

సింహం: దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పనులు చకచకా పూర్తి. సమాజసేవలో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

కన్య: ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

తుల: కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. స్థిరాస్తి ఒప్పందాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతిభ చాటుకుంటారు.

వృశ్చికం: వ్యవహారాలు ముందుకు సాగవు. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు.

ధనుస్సు: నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. అప్రయత్న కార్యసిద్ధి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలలో తగినంత లాభాలు. ఉద్యోగాలలో ఊరట లభిస్తుంది.

మకరం: కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. ఇంటాబయటా అనుకూలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కుంభం: శ్రమానంతరం పనులు పూర్తి. దూరప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

మీనం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో జాప్యం. మిత్రులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

Advertisement
Advertisement