ఈ రాశి వారికి అన్ని పనుల్లో విజయం, శుభవార్త వింటారు | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి అన్ని పనుల్లో విజయం, శుభవార్త వింటారు

Published Fri, Mar 8 2024 6:53 AM

Daily Horoscope In Telugu 08 03 2024 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: బ.త్రయోదశి రా.8.15 వరకు, తదుపరి చతుర్ధశి, నక్షత్రం: శ్రవణం ఉ.8.34 వరకు, తదుపరి ధనిష్ట, వర్జ్యం: ప.12.20 నుండి 1.48 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.25 వరకు తదుపరి ప.12.35 నుండి 1.23 వరకు, అమృతఘడియలు: రా.9.23 నుండి 10.53 వరకు, మహాశివరాత్రి.

సూర్యోదయం :    6.18
సూర్యాస్తమయం    :  6.04
రాహుకాలం : ఉ.10.30
నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమిస్తారు.

వృషభం: వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం ఉండదు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త గందరగోళ పరుస్తాయి.

మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. అనారోగ్యం. ఇంటర్వ్యూలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిపెట్టవచ్చు.

కర్కాటకం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో పేరుప్రతిష్ఠలు దక్కుతాయి. సోదరుల నుండి ధనలాభం. యత్నకార్యసిద్ధి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి.

సింహం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

కన్య: రుణయత్నాలు ముమ్మరం. పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

తుల: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. నూతన విద్యావకాశాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

ధనుస్సు: కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మకరం: సోదరులతో సఖ్యత నెలకొంటుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం: ఆర్థిక ఇబ్బందులు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి.

మీనం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి పిలుపు రావచ్చు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనూహ్యమైన విజయాలు.

Advertisement
Advertisement