ఈ రాశివారికి శుభవార్తలు వినే అవకాశం.. | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (09-11-2020) 

Published Mon, Nov 9 2020 6:19 AM

Daily Horoscope In Telugu (09-11-2020) - Sakshi

శ్రీ శార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, శరదృతువు. నిజ ఆశ్వయుజ మాసం. తిథి బ. నవమి రా.12.18 వరకు, తదుపరి దశమి. నక్షత్రం మఖ తె.4.05 వరకు (తెల్లవారితే మంగళవారం), తదుపరి పుబ్బ. వర్జ్యం సా.4.18 నుంచి 5.51 వరకు. దుర్ముహూర్తం ప..12.05 నుంచి 12.50 వరకు,  తదుపరి ప.2.21 నుంచి 3.06 వరకు. అమృత ఘడియలు రా.1.44 నుంచి 3.16 వరకు.  
సూర్యోదయం: 6.05
సూర్యాస్తమయం: 5.24 
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు.
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు 

మేషం: ఆప్తులతో కలహాలు. వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి.

వృషభం: విలువైన వస్తువులు జాగ్రత్త. ఆకస్మిక ప్రయాణాలు.  ఉద్యోగాలు, వ్యాపారాలలో ఒత్తిడులు తప్పవు. ఒప్పందాలలో ఆటంకాలు. బంధువులతో వైరం. అనారోగ్యం.

మిథునం: కొత్త పనులు  చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.  ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కర్కాటకం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో అకారణ వైరం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం: నూతన ఉద్యోగయోగం. పనులలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: బంధువులతో తగాదాలు. కుటుంబసమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగాలు,వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. కొన్ని పనులు వాయిదా పడతాయి.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత

వృశ్చికం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. వాహనయోగం.

ధనుస్సు: కుటుంబంలో చికాకులు. సోదరులతో విరోధాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగ, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు.

మకరం: రుణాలు తీరి ఊరట చెందుతారు. కొన్ని వివాదాల పరిష్కారం. సోదరులు, మిత్రులతో వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: కుటుంబసౌఖ్యం. విలువైన వస్తువులు సేకరిస్తారు. సమావేశాల్లో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. కొన్ని సమస్యలు తీరతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

Advertisement
Advertisement