ఈ రాశివారికి వ్యాపారాలు సజావుగా సాగుతాయి

12 Apr, 2021 06:30 IST|Sakshi

సోమవారం – 12.4.2021 – శ్రీశార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి అమావాస్య, ఉ.6.56 వరకు, తదుపరి శ్రీ ప్లవనామ సంవత్సరం, చైత్ర శు.పాడ్యమి నక్షత్రం రేవతి ఉ.10.36 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం ...లేదు, దుర్ముహూర్తం ప.12.23 నుండి 1.14 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.40 వరకు, అమృతఘడియలు...ఉ.8.01 నుంచి 9.43 వరకు

సూర్యోదయం 5.50
సూర్యాస్తమయం 6.10
రాహుకాలం ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం ఉ.10.30 నుండి 12.00 వరకు

రాశి ఫలాలు:
మేషం: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. మిత్రులు, కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ  వెలుగులోకి వస్తుంది. పనులలో విజయం. ఆహ్వానాలు అందుతాయి.  బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

మిథునం: ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కుటుంబసమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

కర్కాటకం: పనులు వాయిదాపడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం..

సింహం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

తుల: పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. ఉద్యోగావకాశాలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

వృశ్చికం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. పనులు ముందుకు సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు. అనారోగ్యం.

ధనుస్సు: బంధువుల నుంచి ఒత్తిళ్లు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

మకరం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

కుంభం: అనుకోని ప్రయాణాలు. ఆశ్చర్యకర సంఘటనలు. ఆరోగ్యసమస్యలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొన్ని సమస్యలు.

మీనం: ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.
 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు