ఈ రాశివారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు | Sakshi
Sakshi News home page

ఈ రాశివారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు

Published Sat, Aug 14 2021 6:22 AM

Daily Horoscope In Telugu 14-08-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.షష్ఠి ప.12.26 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం చిత్త ఉ.8.34 వరకు, తదుపరి స్వాతి వర్జ్యం ప.1.44 నుండి 3.12 వరకు దుర్ముహూర్తం ఉ.5.45 నుండి 7.26 వరకు అమృతఘడియలు... రా.10.36 నుండి 12.04 వరకు.

సూర్యోదయం :    5.45
సూర్యాస్తమయం    :  6.24
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. రుణ ఒత్తిడులు తొలగుతాయి. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విందువినోదాలు.

వృషభం: మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు. వ్యవహారాలలో పురోగతి. భూ, గృహయోగాలు. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో అభివృద్ధి. దైవదర్శనాలు..

మిథునం: ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. బంధువర్గంతో మాటపట్టింపులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కర్కాటకం: కుటుంబసౌఖ్యం. విలువైన సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. చర్చలు సఫలం. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి. 

సింహం: ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యభంగం. విద్యార్థులకు శ్రమ తప్పదు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. నిర్ణయాలలో తొందరవద్దు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. 

తుల: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. భూవివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చికం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు రాగలవు. బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. నిరుద్యోగులకు ముఖ్య సమాచారం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

కుంభం: కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.

మీనం: బంధువులతో స్వల్ప విభేదాలు. ధనవ్యయం. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన.
 

Advertisement
Advertisement