ఈ రాశి వారి ఆలోచనలు స్థిరంగా ఉండవు | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారి ఆలోచనలు స్థిరంగా ఉండవు

Published Thu, May 27 2021 6:20 AM

Daily Horoscope In Telugu 27 May 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ.పాడ్యమి ప.2.56 వరకు, తదుపరి విదియ నక్షత్రం జ్యేష్ఠ రా.1.05 వరకు, తదుపరి మూల, వర్జ్యం ఉ.7.53 నుంచి 9.22 వరకు, దుర్ముహూర్తం ఉ.9.46 నుంచి 10.38 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.48 వరకు అమృతఘడియలు... సా.4.21 నుంచి 6.21 వరకు.

సూర్యోదయం :    5.29
సూర్యాస్తమయం    :  6.24
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు: 
మేషం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. శుభకార్యాలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆస్తిలాభం.

మిథునం: కొత్త పనులకు శ్రీకారం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. 

కర్కాటకం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. 

సింహం: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. శ్రమతప్పదు. విద్యార్థులకు ఒత్తిడులు.  వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

కన్య: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

తుల: పనులు ముందుకు సాగవు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృశ్చికం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. పనుల్లో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన.

మకరం: ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థులకు అనుకూలం.  వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కుంభం: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. వాహనయోగం.

మీనం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
 

Advertisement
Advertisement