ఈ రాశివారికి శ్రమ ఫలిస్తుంది

4 Mar, 2021 06:09 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి బ.షష్ఠి రా.2.12 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం విశాఖ తె.4.04 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.10.55 నుండి 12.24 వరకు, దుర్ముహూర్తం ఉ.10.16 నుండి 11.01 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు అమృతఘడియలు... రా.7.53 నుంచి 9.20 వరకు.

సూర్యోదయం :    6.21
సూర్యాస్తమయం    :  6.02
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: పరిచయాలు పెరుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి..

మిథునం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకుల. వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం.

సింహం: పనుల్లో విజయం. ఆస్తులు కొనుగోలు చేస్తారు.  ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య: కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఖర్చులు అధికం. ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం.

తుల: ఆర్థిక లావాదేవీలలో పురోగతి.. పనులు చకచకా పూర్తి చేస్తారు. వస్తులాభాలు.  చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. బంధువులు, మిత్రులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

ధనుస్సు: కొత్త పనులు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన.  వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి.

మకరం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో మరింత సఖ్యత. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.  దైవదర్శనాలు.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి.

కుంభం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.  అదనపు ఖర్చులు. బంధువులతో విభేదాలు.  వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని ఇబ్బందులు. శ్రమాధిక్యం.

మీనం: పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. కుటుంబంలో ఒత్తిడులు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తప్పకపోవచ్చు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు